ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ సృష్టించింది. సినీ పక్కిలో హైవేపై భయానక వాతావరణ సృష్టించిన అంబులెన్స్ ను తెలంగాణ పోలీసులు చేజ్ చేశారు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి 108 అంబులెన్స్ ను చోరీ చేసి విజయవాడ వైపు తీసుకు వెళుతూ ఆగమాగంగా హైవేపై అంబులెన్స్ మితిమీరిన వేగంతో నడుపుతూ భయానక వాతావర ణం సృష్టించాడు. హైదరాబాద్ హయత్ నగర్ లో 108 చోరీ చేసి ఖమ్మం వైపు వెళ్లేందుకు సదరు దొంగ ప్రయత్నించాడు.గతంలో ఇదేవిధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు తెలిపిన కేతేపల్లి ఎస్సై శివతేజ మీడియాకు వెల్లడించారు.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుం డి నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు అంబులెన్స్ ను అతివేగంగా నడుపుతూ ఎవ్వరికీ దొరకకుండా ముందుకు సాగాడు. చివరకు చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీ కొట్టి మరీ సదరు దొంగ పారిపోయాడు. అదఅదే విధంగా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద కూడా టోల్ సిబ్బందితో పాటు పోలీసులు అంబులెన్స్ ను నిలు వరించేందుకు ప్రయత్నించగా వారికి కూడా చిక్కకుండా టోల్ గేటు ను ఢీ కొట్టి మరీ అంబులెన్స్ దొంగ పారిపోయాడు.
విశ్వ ప్రయ త్నాల అనంతరం ఎట్టకేలకు టేకు మట్ల స్టేజి వద్ద రోడ్డుకు అడ్డంగా లా రీలను పెట్టి అంబులెన్స్ తో పారి పోతున్న దొంగను కేతేపల్లి ఎస్ఐ శివతేజ పట్టుకున్నాడు.కేతేపల్లి పోలీసుల అదుపులో సందర్భంగా ఉన్నాడన్న సమాచారంతో 108 సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Abulens theft in hayathnagar pic.twitter.com/4blzUKCfMv
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) December 7, 2024