— కారుతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం
Telangana Police : ప్రజా దీవెన, భువనగిరి: తెలంగాణ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఏదో రకంగా పోలీసులు ఆరోపణలు విమర్శలకు గురవు తూనే ఉన్నారు. ఓ వైపు నిందితు లకు రాచమర్యాదలు అమలు చే స్తూ విమర్శలకు గురవుతూ వస్తు న్న పోలీస్ శాఖ తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మరో వివాదస్పద వివాదానికి తెరదీ సింది. భువనగిరిలో మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపు తున్న వారిని కారులో రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వైనం తీవ్ర చర్చనీయాంశం అయింది.
భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీ సు మీద దాడికి నిరసనగా వినా యక చౌరస్తా వద్ద నిరసన తెలు పుతున్న వల్లపు విజయ్ ముది రాజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న సంఘటన సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు విచక్షణారహితంగా సదరు బాధి తున్ని నడిరోడ్డుపై కారుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు.