భారీ ఎన్ కౌంటర్, ఏడుగురు మావోయిస్టుల మృతి
ప్రజా దీవెన, ములుగు :ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆదివా రం తెల్లవారుఝామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చల్పాక సమీ పంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావో యిస్టులు మృతి చెందారు . తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావో యిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.మృతుల్లో మావోయిస్టు కీలక నేత కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు సమాచారం.
ఆయనపై 20 లక్షల రివార్డ్ ఉండడం గమనార్హం. అయితే గతంలో ఇదే ప్రాంతంలో ఘటన కొన్నేళ్ల క్రితం ఏటూరునా గారంలోని చల్పా కలో ఒళ్లు గగ్గురు పొడ్చే ఘటన చోటు చేసుకుంది. పీపుల్స్ వారు మందుపాతరకు పోలీసులు జీపు ఎగిరి పడి పోలీసుల అవయ వా లు చెట్లపై పడిన ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. మళ్లీ ఇదే ప్రాం తంలో భారీ ఎన్ కౌంటర్ జరగడంతో ఆ ఘటన ప్రస్తుతం అందరూ మననం చేసుకుంటున్నారు.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1.కుర్సం మంగు @ భద్రు @ పాప న్న, 35 సంవత్సరాలు, బీజా పూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్. TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-47 రైఫిల్
2.ఏగోళపు మల్లయ్య @ మధు, DVCM : 43 సంవత్సరాలు, రామ గిరి (m), పెద్దపల్లి జిల్లా, తెలంగా ణ. DVCM,కార్యదర్శి ఏటూరు నాగారం మహదేవ్‌పూర్ AC, AK-47 రైఫిల్,
3.ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 22 సంవత్సరాలు, తంబేల్బ ట్టి (v),ఉసుర్ (m), బీజాపూర్ జి ల్లా, ఛత్తీస్‌గఢ్. G3 రైఫిల్
4.ముస్సాకి జమున, ACM, 23 సంవత్సరాలు , పొరోవాడ (v), బైరామ్‌ఘర్
5.జై సింగ్, పార్టీ సభ్యుడు, వయస్సు: 25 సంవత్సరాలు, ఇంద్రావతి ప్రాంతం, 303 రైఫిల్.
6.కిషోర్, పార్టీ సభ్యుడు, వయ స్సు: 22 సంవత్సరాలు, n/o పాం పాడ్ (v), గంగులూరు PS, బీజా పూర్జిల్లా, ఛత్తీస్‌గఢ్, ఇన్సాస్ రైఫి ల్.
7.కామేష్, పార్టీ సభ్యుడు, వయ స్సు: 23 సంవత్సరాలు, n/o మలంపెంట (v), ఉసూర్ PS, బీజా పూర్జిల్లా, ఛత్తీస్‌గఢ్, SBBL గన్.
Telangana police encounter