Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Rains: కొనసాగుతోన్న వర్షాలు ప్రాజెక్టులకు జల కళ

–మరో మూడు రోజులూ వర్షాలు, 9 జిల్లాలకు అలర్ట్‌
–ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా రాక
–జూరాల 27 గేట్ల ఎత్తివేత, తో శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు
–గోదావరి ఉధృతితో మేడిగడ్డకు 5.52 లక్షల క్యూసెక్కులు
–భద్రాచలంలో నీటిమట్టం 45 అడుగులకు చేరిక
–తెలంగాణలో ముసురేనుకోవ lడం తో పెరిగిన చలి తీవ్రత

Telangana Rains: ప్రజా దీవెన, హైదరాబాద్: వర్షా కాలం సీజన్‌ ఆరంభమై చాలా కాలం అయినా పెద్దగా వర్షాలు (rains) కురువక అంతా అయోమయ పరిస్థితి నెలకొంది. వర్షాల కోసం ఎదురుచూసి ఎదురుచూసి వర్షా భావం తప్పదా అన్న ఆందోళన వెల్లడయ్యే క్రమంలో వరుణుడు కాస్తో కూస్తో కరుణించిoడని చెప్పవచ్చు. తెలంగాణలోనే కాక ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృ ద్ధిగా (Abundance of rains)కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతూ ముం దుకు సాగుతుండగా, గోదావరి ఉధృత రూపం దాలుస్తోంది. మొత్తానికి ప్రాజెక్టులు జల కళను సంతరించుకుంటున్నాయి. మరి కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకా శం ఉండడం, వరద కొనసాగనుండ డంతో పంటల సాగుపై ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలు గు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు అయిన జూరాలలో ఆదివారం 27 గేట్లను ఎత్తారు. 1.2 9 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండ గా 1.34 లక్షల క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. జూరా ల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ శ్రీశైలం (Krishnamma Srisailam)వైపు పరుగులుపెడుతోంది. 95,7 86 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరు తోంది. ఇది మరింత పెరిగే అవకా శం ఉంది.

కాగా, ఆల్మట్టి జలాశయా నికి 1,35,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,50,000 క్యూసెక్కుల ను, నారాయణపూర్‌కు 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 25 గేట్లను ఎత్తి 1.45 లక్షల క్యూసెక్కు లను జూరాలకు వదులుతున్నారు. కృష్ణా ఉప నది తుంగభద్రకూ వరద కొనసాగుతోంది. 1.19 లక్షల క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరోవైపు గోదావరి, ప్రాణహిత, మంజీరా (Godavari, Pranahita, Manjira) ఉప్పొంగడం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి 9.50 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఆదివారం సాయంత్రానికి వరద 5.52 లక్షల క్యూసెక్కులకు పెరి గింది. 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపి స్తున్నారు. అన్నారం బ్యారేజీకి 16,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ రెండింటికీ తోడు ఆదిలాబాద్‌, మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణ హిత, ఇంద్రావతి నదుల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండటంతో సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 8.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మహారాష్ట్రలో పడుతున్న వర్షాలతో గోదావరి, మంజీరా, హరిదా నదుల ద్వారా ఎస్సారెస్పీలోకి 18,518 క్యూసె క్కుల నీరు వచ్చి చేరుతుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోకి స్వల్పంగా వరద వస్తోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా 690 అడు గులు దాటింది. 25,968 క్యూసె క్కుల వరద వస్తోంది. 4 గేట్లను ఎత్తి 18,277 క్యూసెక్కులను గోదా వరిలోకి వదులుతున్నారు.

వచ్చే మూడు రోజులూ వానలే వానలు… తెలంగాణలో వచ్చే మూ డు రోజులూ వర్షాలు కురు స్తాయని, 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది. చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయు గుండం అల్ప పీడనంగా బలహీ నపడిందని పేర్కొంది. మంచిర్యాల, ఆదిలాబాద్‌, కొమురంభీం, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని వివరించింది. ఈ 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

వరదలో ఇద్దరు గల్లంతు

భద్రాద్రి జిల్లా పినపాక మండలం పోట్లపల్లి వద్ద చెక్‌డ్యాంలో (checkdam) చేపల వేటకు వెళ్లిన పాయం నగేశ్‌ గల్లం తయ్యాడు. స్నేహితుడు బడే నాగ రాజుతో కలిసి వెళ్లిన ఇతడు.. చేప లు పడుతుండగా ప్రవాహం ఒక్క సారిగా పెరిగింది. ఇద్దరూ వాగులో కొట్టుకుపోయారు. నాగరాజు అతి కష్టమ్మీద ఒడ్డుకు చేరాడు. నగేశ్‌ ఆచూకీ దొరకలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో గాలింపు చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం బొప్పరి కుంటకు చెందిన టేకం లక్ష్మణ్‌ గంగా పూర్‌ వాగులో గల్లంత య్యాడు. వాగు ఉధృతంగా పారు తుండడంతో లక్ష్మణ్‌ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.