Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana RTC MD sajjannar formation day : తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయం

--ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు --పెరిగిన రద్దీకి అనుగుణంగా2990 కొత్త బస్సులు ఆగమనం --త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ శ్రీకారం --తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశా బ్ది వేడుకల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో
ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయం

–ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు
–పెరిగిన రద్దీకి అనుగుణంగా2990 కొత్త బస్సులు ఆగమనం
–త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ శ్రీకారం
–తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశా బ్ది వేడుకల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (tgsrtc) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స‌జ్జ‌ న‌ర్ అన్నారు. ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి తోనే సంస్థలో విప్లవాత్మక మార్పు లను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

హైద‌రాబాద్ లోని బ‌స్భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ ( telangana state formation day) దశాబ్ది వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడు కలకు ముఖ్య అతి థిగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ ( VC sajjannar) హాజరై జాతీయ జెండాను ఆవిష్క‌ రించారు. తెలం గాణ ఉద్య‌మంలో ప్రాణాల‌ర్పిం చిన అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భ‌ద్ర‌తా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

ఈ సందర్భంగా స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మ‌లి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరు లకు ఘననివాళులర్పిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు  20 11లో 29 రోజులపాటు ‘మేము సైతం’ అంటూ సకల జను ల సమ్మెను కొనసాగించారని గుర్తు చేశారు.

దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒక టిగా నిలిచింది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు (RTC employees)  పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచి పోయింది.” అని అన్నారు.

మహాలక్ష్మి మహిళల కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంట ల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్పూర్తితో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతోందన్నారు. మహాలక్ష్మి ( mahala ksmi)  పథక అమ లుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే ప్రస్తు తం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు.గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.

మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకు రావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎల క్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వర లోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణం గా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమా న్యం నిర్ణయించిందని తెలిపారు.

ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర అవ‌ర‌త‌ణ వేడుకల్లో టీజీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ఫ, సీఈఐటీ రాజ‌శేఖ‌ర్, సీటీఎం(కమర్షియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీసీవోఎస్ విజయభాస్కర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.