Cyber Crime: ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట తహశీల్దార్‌కు కుచ్చుటోపి పడింది. ఏసీబీ అధికారిని అంటూ తహశీల్దార్ దామోదర్‌కు ఓ అగంతకుడు ఫోన్ చేసి ఫోన్ సంప్రదించాడు. తహసిల్దార్ కు సంబంధించిన అవినీతికి పాల్పడుతున్నావని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు వెనువెంటనే డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదన్న దుండగుడు దబాయించాడు.
దీంతో అసలు విషయం తెలుసుకోకుండా తొందరపాటులో ఆన్‌లైన్‌లో రూ.3.30లక్షలు పే చేశారు తహశీల్దార్ దామోదర్. కొద్దిసేపట్లోనే మోసపోయానని సైబర్ క్రైమ్‌లో దామోదర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.