ముచ్చటగా ఆ మూడింటిపై మనసు పెట్టండి
— తాగు, సాగునీరు, విద్యుత్ సమ స్యలు రాకుండా అరికట్టండి
–అత్యవసర పరిస్థితుల్లో అధికా రుల అప్రమత్తత అవసరం
–ఎట్టిపరిస్థితుల్లో ఎండిపోవద్దు ఇరిగేషన్ కింది ఎకరం పొలం
–ప్రజా ప్రతినిధులతో కలిసి సమ న్వయంతో పని చేయండి
–అధికారులందరూ క్షేత్రస్థాయి లో నే ఉండి చర్యలకు ఉపక్రమించాలి
–జిల్లా సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
TelanganaCabinet : ప్రజాదీవన, నల్గొండ బ్యూరో :ఉమ్మ డి నల్గొండ జిల్లాలో ఈ వేస విలో తాగునీరు, సాగు నీరు, విద్యు త్ కు ఇబ్బందులు రాకుండా అధి కారులు, ప్రజాప్రతి నిధులు కలిసి సమన్వయంతో చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరా రు. శనివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ ఆవర ణలోని ఉదయాది త్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా తాగునీరు, ఇరిగేషన్, విద్యుత్ అంశాలపై నిర్వ హించిన సమీక్ష సమావేశానికి అయన ముఖ్యఅ తిథిగా హాజర య్యారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుం డా, అలాగే పంటలు ఎండిపోకుండా, విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగే విధం గా సంబంధిత శాఖల సీనియర్ అధికారులు మొద లుకొని కింది స్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి అధికారులందరూ క్షేత్రాలు క్షేత్రస్థా యిలోనే ఉండి పరి స్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మిషన్ భగీరథ అధి కారులు ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఏర్పడ కుండా ఈ ఎన్ సి స్థాయిలో పూర్తి దృష్టి సారించాలన్నారు.తక్షణ తాగునీటి సమస్య లను తీర్చేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్ల వద్ద నిధులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వెసు లుబాటు కల్పిస్తా మని, అలాగే ముఖ్య మంత్రితో చర్చించి శాసనస భ్యులకు ఎస్ డి ఎఫ్ కింద నిధులు ఇచ్చేలా చర్చిస్తామన్నారు. ఇరిగే షన్ కి సంబంధించి ఒక ఎకరం పొలం ఎండిపోకుండా ఆయకట్టు చి వరి వరకు సాగునీరు అందించి పంటలు కాపాడాలన్నారు. ఇంజ నీరింగ్ అధికారులు కాలువలపై పర్యటించాలని, అలాగే వ్యవ సా య అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తిరిగి ఎప్పటికప్పుడు నీటి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఆయా ప్రాజెక్టుల కింద ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని సరైన విధంగా పర్యవేక్షణ చేసి అందరికీ వచ్చేలా చూడాలని చెప్పారు. వి ద్యుత్ అధికారులు విద్యుత్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ క్షేత్ర స్థాయిలోనే తిరిగి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మూడు స మస్యలపై మనసుపెట్టి పనిచేయాలని, అదేవిధంగా ప్రజాప్రతినిధు లు సైతం మండల స్థాయి అధికారులను వెంట తీసుకుని వెళ్లి గ్రా మాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వేసవిలో పై మూడు అంశాల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు మనసుపెట్టి పనిచేసి సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
పదిహేను కోట్లు కావాలి…రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి మాట్లాడుతూ తక్షణం తాగునీటి అవసరాలకు జిల్లా కలెక్టర్ల వద్ద ప్రతి జిల్లాకు కనీసం 5 కోట్లు, నల్గొండ జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉ న్నందున 15 కోట్ల నిధులు ఉంచాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృ ష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఎక్కడ తా గునీటి సమస్య ఉంటే అక్కడికి వెళ్లి వెంటనే సమస్యను పరిష్కరిం చేందుకు కృషి చేయాలని అన్నారు.
సాగునీటికి సంబంధించి నిర్వ హణ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించాలని, మేజర్ ప్రాజెక్టు లు, కెనాల్సిఫై ఖచ్చితంగా నిర్వహణ ను చూడాలని, ఏ ఎం ఆర్ ప్రాజెక్టు కింద కెనాల్ విస్తరణ, లైనింగ్ చే పడితే సమృద్ధిగా నీరు అందించవచ్చని, ఉదయ సముద్రం మేజర్ కెనాల్ పూర్తి చేసి చెరువులకు నీరు అందిస్తే సాగునీటి సమస్య రాద ని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కేనాలపై వందలాది మోటర్లు ఏ ర్పాటు చేసుకున్నారని, అలాగే అవసరం లేకున్నా నిరంతరం పవర్ బోర్లు నడుస్తున్నాయని, దీనివల్ల విద్యుత్ తో పాటు నీరు వృధా అ వుతుందని, వీటిని నియంత్రించే విషయమై అధికారులు ఆలోచిం చాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద కెనాల్స్ లో చిన్న చిన్న ప నులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యుత్ కు ఎక్కడ సమస్య లేదని, అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఈ వేసవిలో అప్ర మత్తంగా ఉండాలని అన్నారు.
ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలి…రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మిష న్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు వేసవిలో కష్టమైనప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించా లని కోరారు. జిల్లా కలెక్టర్లు తాగునీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల ని, అందుబాటులో ఉన్న నిధులను ప్రతి గ్రామానికి 10 నుండి 15 వేల రూపాయల చొప్పున తక్షణమే గ్రామాలలో అందుబాటులో ఉం చి ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతే వెంటనే ఆ నిధు ల ద్వారా పరిష్కరించాలని తెలిపారు. శాసనసభ్యులు సైతం వారి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి తాగునీటి కోసం నిధులు కేటాయించా లని కోరారు.
1775 గ్రామాలకు రోజు 140 ఎంఎల్ డి నీళ్లు…సమావేశం ప్రారం భమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా లోని తాగునీరు, ఇరిగేషన్, విద్యుత్ పరిస్థితులను సమావేశానికి వివరిస్తూ జిల్లాలో 1775 గ్రామాలు ఉన్నాయని, ప్రతిరోజు 140 ఎం ఎల్ డి తాగునీరు అవసరం ఉందని, విలీన గ్రామాలలో తప్ప ఎక్క డ సమస్య లేదని, అయితే తాగునీటి బోర్లు, చిన్న చిన్న మర మ్మతు లకు అలాగే పైపులైన్ మరమ్మతులు తదితర వాటికి ఎస్ డి ఎఫ్ కింద పది కోట్ల 30 లక్షల రూపాయలు కావాలని, జిల్లాలో 26 సమ యాత్మక గ్రామాలను గుర్తించినట్లు వెల్లడించారు.
విద్యుత్ కు సంబంధించి సమస్యలు లేవని, సబ్ డివిజన్ వారిగా సమిక్షించి 250 ట్రాన్స్ఫార్మర్లు కావాలని గుర్తించడం జరిగిందని, 9 క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ కింద నాగార్జునసాగర్ ద్వారా రెండు పంటలకు సాగునీరు ఇస్తున్నామని, వచ్చే పది రోజుల వరకు ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా కొనసాగుతుందని, ఆ తర్వాత శ్రీశైలం నుండి సాగునీటిని విడుదల చేయాల్సి ఉందని ఈ విషయంపై చర్యలు తీసుకునే విధంగా మం త్రు ల దృష్టికి తీసుకువచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ లు వారి జిల్లాలకు సంబం ధించిన తాగునీరు, ఇరిగేషన్, విద్యుత్ పరిస్థితుల పై మంత్రులు, శాసనసభ్యులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ 3 అంశాల పై చర్చ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వివిధ విషయా లను తెలియజేశారు.
మిషన్ భగీరథ ద్వారా నీరు అందడం లేదు…భువననగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ కింద 100 లీటర్ల నీరు అందడం లేదని, తన నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో బోర్ల ద్వారా కూడా తాగునీటి సరఫరా అవుతున్నదని, బోర్ నీళ్లు, తాగునీరు కలిసిపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడు తున్నాయని, కొన్నిచోట్ల కొత్త బోర్లు అవసరం ఉన్నాయని తెలిపారు.
ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా పిల్లాయిపల్లి, బునియదిగాని పల్లి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. బస్వాపురం ఆర్ అండ్ ఆర్ కింద వశీకరణ చెల్లింపులు వెంటనే చేయాలని, కాలువల్లో గుర్ర పుడెక్క తీయాలని, కాలువలపై ఏర్పాటు చేసిన మోటార్లను ని యం త్రించాలని కోరారు.
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ మాట్లాడుతూ సు దర్శ పురం వాటర్ ట్యాంక్ ను పూర్తిచేయాలని, మోత్కూరు జనా భాకు అనుగుణంగా తాగునీటిని సరఫరా చేసేందుకు పైప్లైన్ డయా పెంచాలని, అలాగే తండాలలో బోర్లు చెడిపోయి ఇబ్బంది పడుతు న్నారని వాటికి నిధులు ఇవ్వాలని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిం చాలని కోరారు. ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా జాలిపురం వరకు సాగునీరు ఇచ్చేందుకు మరో రెండు మూడు రోజులు సాగు నీటిని సరఫరా చేయాలని కోరారు. ఎస్సారెస్పీ కింద బిక్కమల్ల వర కు నీరు రావడంలేదని, నూతనకల్ దాటి నీరు వెళ్లాల్సిన అవసరం ఉందని, కాలువలో జంగిల్ కటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం తన నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలో తాగు నీటి కొరత వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం తండాలలో బోర్ల ద్వారా తాగునీరు తెచ్చుకుంటున్నారని, కొత్త బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అలాగే అద్దె బోర్ల రేట్లు పెంచాలని, నిడమ నూరు చెరువును నీటితో నింపితే నిడమనూరు, హాలియా మున్సి పాలిటీకి తాగునీరు అందుతుందని అన్నారు.
దేవరకొండ శాసనస భ్యులు బాలునాయక్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా లో భాగంగా క్రిటికల్ గ్యాస్ ని పూర్తి చేయాలని, పెళ్లిపాకల ప్రాజెక్టు కింద ఏజెన్సీకి జీతాలు చెల్లించాలని, ప్రతి గ్రామంలో అద్దె బోర్లు తీసుకునేందుకుగాను టీంలు ఏర్పాటు చేయాలని , తాగునీటి కోసం జిల్లా కలెక్టర్ల వద్ద నిధులను ఏర్పాటు చేయాలని కోరారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ తాగునీటి కోసం ప్రతి నియోజకవర్గానికి కొద్ది మొత్తంలో నిధులను కేటాయించి జిల్లా కలెక్టర్ నియంత్రణలో ఉంచాలని, గ్రామపంచాయతీలో తాగునీటి సమస్యలు ఏర్పడితే పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులు వెంటనే ఏర్పాటు చేసే విధంగా వారి దగ్గర నిధులు ఉంచాలని, తన నియోజకవర్గంలో 2,3 గ్రామాలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, వాటికి తాగునీటి వనరులను గుర్తించి తాగునీటిని సరఫరా చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా ఏఎంఆర్పి ద్వారా తక్కువ మొత్తంలో కాలువలకు సాగునీరు వస్తున్నదని, అలా కాకుండా మరో 10 రోజులపాటు నీరు వదలాలని, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద జాతీయ రహదారి క్రాసింగ్ కు అనుమతి తీసుకోవాలని మంత్రులతో కోరారు. విద్యుత్ సరఫరాలో ఆయా గ్రామాల నుండి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిష న్ భగీరథ ఏజెన్సీకి బకాయిలను వెంటనే చెల్లించాలని, దామరచర్ల, అడవిదేవులపల్లి, మిర్యాలగూడలో తండాలు ఎక్కువగా ఉన్నాయ ని, గత సంవత్సరం అద్దె బోర్లకు చెల్లించిన మొత్తాన్ని వెంటనే విడు దల చేయాలని కోరారు. ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా వజీర్ బాగ్ కాల్వ చివరి వరకు సాగునీరు ఇవ్వాలని, డి-40 కింద నీరు రావటం లేదని కోరగా ఈ విషయంపై ఇంచార్జి మంత్రి స్పందిస్తూ ముందుగా కాలువల చివరలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించిన తర్వా త పై భాగాన ఉన్న వాటికి తర్వాత అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సాగునీటి అధికారులు పర్యవేక్షిస్తే ఇలాంటి సమస్యలు రావాలని తెలిపారు.
ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గుండాల మం డలంలో 50శాతం పంటలకే నీరు వస్తున్నదని, మరో వారం రోజుల పాటు 200 క్యూసెక్కుల నీరు వదిలితే ఆత్మకూరు ప్రాంతంలోని చివ రి ఆయకట్టుకు సాగునీరు వస్తుందని కోరారు.
కోదాడ శాసనసభ్యు రాలు పద్మావతి మాట్లాడుతూ మునుగోడు వర కు సాగునీరు అందిం చాలని, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారుల మ ధ్య సమన్వయం లేకపోవడం వల్ల నీటి విషయంలో స్పష్టత లేదని తెలుపగా, ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ వ్యవ సాయ, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతిరోజు నివేదికను ఇవ్వాలని, జిల్లా కలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. విద్యుత్ పై జరిగిన చర్చ సందర్భం గా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ లైను డిస్ట్రిబ్యూటర్లు, కండక్ట ర్లు, కేబుల్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని కోరారు.
మిషన్ భగీరథ ఈ ఎన్ సి కృపాకర్ రెడ్డి, ఇరిగేషన్ ఈ ఎన్ సి హరిలాల్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఆయా విష యాలపై జరిగిన చర్చ సందర్భంగా వివరాలను తెలియజేశారు. జిల్లా ఎస్ ఎస్పీ శరత్ చంద్ర పవర్, అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో పాటు, జిల్లా అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.