TelanganaGovernment: విత్తనరంగంలో స్వయంసమృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఆశయo
--ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ జానయ్య
TelanganaGovernment: ప్రజా దీవెన, తిప్పర్తి: రానున్న రెం డు, మూడేళ్ళలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల న్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని ప్రొఫె సర్ జయశంకర్ వ్యవసా య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫె సర్ ఏ .జానయ్య తెలి పారు. ఇందు కుగాను 430 మంది వ్యవసాయ వి శ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పర్యవే క్షణలో నాణ్యమైన విత్తనాలను రూ పొందించి వాటిని రాష్ట్రంలోని 11 వేల రెవెన్యూ గ్రామాలలోని 40 వేల మంది రైతులకు ఫౌండేషన్ విత్తనా లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. “నాణ్యమైన విత్తనం- రైతు నేస్తం” పేరున వ్యవసాయ వి శ్వవిద్యాలయం రూపొందించిన ఫౌండేషన్ సీడ్ పంపిణీ కార్యక్రమా న్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఇ తర ప్రజాప్రతినిధుల ద్వారా 300 మంది రైతు లకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం నుండి రా ష్ట్రం లోని అన్ని రైతు వేదికల ద్వా రా రెవెన్యూ గ్రామానికి ముగ్గురు లే దా నలుగురు రైతుల చొప్పున ఈ ఫౌండేషన్ సీడ్ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
వ్యవ సాయ విశ్వవిద్యాలయం రూపొం దించిన విత్తనాలను ఎంపిక చేసిన రైతులు ఈ సంవత్సరం వాటిని వి నియోగించి మంచి పంటలు పండి స్తే వచ్చే సీజన్ కు వారు ఆ విత్త నా న్ని వినియోగించుకోవడంతో పా టు ఇతర రైతులకు ఇదే విత్తనాన్ని సరఫరా చేస్తే విత్తనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రానున్న సీజ న్లో మంచి పంటలు పండించుకోవ చ్చని అన్నారు.నాణ్యమైన విత్తనం రైతు నేస్తం” పేరుమీద మంగళవా రం ప్రొఫెసర్ జయ శం కర్ వ్యవసా య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి రై తు వేదికలో ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు.
రైతులు నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసినట్లయితే తిరిగి దానిని ఇతర రైతులకు ఇవ్వడం ద్వారా రా నున్న రెండు, మూడు ఏళ్లలో రా ష్ట్రంలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించిన వారమవు తా మని అన్నారు. ఈ సంవత్సరం తొ లకరి ముందే ప్రారంభమైనం దున కొన్ని గ్రామాలలో నకిలీ విత్తన కం పెనీలు విత్తనాల పేరిట రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యా యని, నకిలీల బెడద లేకుండా వ్య వసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన రిజి స్టర్డ్ విత్తనాలనే వా డాలని ఆయన కోరారు. వ్యవసాయ విశ్వవి ద్యాలయం పంపిణీ చే స్తున్న ఫౌండేషన్ సీడ్ ను రైతులు సద్విని యోగం చేసుకోవాలని, ఒక వేళ విత్తన వినియోగంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వ్య వసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవే త్తల దృష్టి తీసుకురావాలని కోరా రు. యాసంగిలో వరికి బదులుగా పప్పు ధాన్యాలు పండించాలని , దాని ద్వారా దీర్ఘకాలంలో నేల సా రవంతంగా ఉండటమే కాకుండా, మంచి గిట్టుబాటు ధరలు వచ్చేం దుకు, రైతుకు లాభదాయకంగా ఉండేందుకు అవకాశం ఉందన్నా రు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లా డుతూ నకిలీ విత్తనాల వల్ల రైతు లు మోసపోకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విత్తనా లను రూపొందించి వాటిని రైతుల కు పంపిణీ చేయడం ద్వారా తిరిగి రైతులు అదే విత్తనాలను ఉపయో గించి నాణ్యమైన పంట లు పండిం చుకునేందుకు చేపట్టిన విత్తన పం పిణీ కార్యక్రమం రైతులకు ఎంతగా నో ఉపయోగపడుతుందని అన్నా రు. నల్గొండ జిల్లాలో ఉన్న 564 రెవెన్యూ గ్రామాలలో గ్రామానికి ముగ్గురు లేదా నలుగురు చొప్పున రైతులకు ఇన్పుట్ సీడ్ ను ఇవ్వ నున్నట్లు తెలిపారు.
జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వ్యవసాయ సాగుకు ఆవకాశం ఉం దని, అనేకమం ది రైతులు వివిధ విత్తనాల కొనుగో లు సందర్భంగా నకిలీ విత్తనాల బా రిన పడి మోసపోతున్నారని, అలా కాకుండా వ్యవసాయ విశ్వవిద్యా లయం ద్వారా ఫౌండేషన్ సీడ్ పం పిణీ చేయడం వల్ల రైతులకు మే లు జరుగుతుందని తెలిపారు. ఒకే రకమైన విత్తనాన్ని వాడటం వల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉం డి నష్టపోయే అవకాశం ఉందని, అం దువల్ల రైతులు రిజిస్టర్ సీడ్ నే వా డాలని ,ఒకే విత్తనం కాకుండా వివి ధ రకాల విత్తనాలు వా డాలని ఆమె పిలుపునిచ్చారు.
జిల్లాలో వరితో పాటు, పత్తి, పప్పు ఎక్కువగా సాగు చేస్తున్నారని, వరికి సంబంధించి విత్తనానికి ఎవరిపై ఆధారపడాల్సి న అవసరం లేకుండా మన రైతులే సరైన వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తు న్నారని, ఆ విత్తనాలు వాడడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుం దని, నకిలీ విత్తనాల బారిన పడ కుండా ఉండొచ్చని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 మంది రైతులకు అన్ని రెవెన్యూ గ్రామాలలో ఇన్పు ట్ సీడ్ ను అందించనున్న ట్లు ఆమె తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన కనగల్ రైతు పల్లేటి రాంరెడ్డి మా ట్లాడుతూ రెండవ పంటలో తప్పని సరిగా పప్పు ధాన్యాలు, ఇతర పం టలు సాగు చేసే విధంగా ప్రభుత్వ మే చొరవ తీసుకోవా లని, ప్రత్యా మ్నాయ పంటలకు ప్రభుత్వం గిట్టు బాటు ధర కల్పిం చాలని కోరారు.మరో రైతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం పప్పుధాన్యాలను ప్రోత్సహించడంతోపాటు, విత్తనా లు సరఫరా చేయాలని, ఈ ప్రాం తంలో కందులకు ఎక్కువగా డిమాండ్ ఉంద ని, కంది విత్తనాలను పంపిణీ చేస్తే రైతులకు మేలు కలుగుతుం దని అన్నారు.
రాష్ట్రస్థాయి నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శా ఖ కమిషనర్, సంచాలకులు, శాస్త్ర వేత్తలు, వ్యవసాయ అధి కారులు మేలైన విత్తనం ఎంపిక,వాటి ప్ర యోజనాలు, వరికి బదు లుగా వేసే ప్రత్యామ్నాయ పంటలు, పురుగు మందుల వాడకం తగ్గింపు తదితర అంశాలపై రైతులకు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులప తి తో కలిసి రైతులకు వరి ఫౌండేషన్ సీడ్ ను పంపిణీ చేశారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్ కు నల్గొండ వ్యవ సాయ మార్కెట్ కమిటీ చై ర్మన్ జూ పూడి రమేష్, మాజీ జెడ్పిటిసి పా శం రామ్ రెడ్డి ,డిసిసిబి డైరెక్టర్ పా శం సంపత్ రెడ్డి ,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ,తిప్పర్తి మండల వ్యవసాయ అధికారి సన్నీ రాజ్, తదితరులు హాజరయ్యారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను ఆక స్మికంగా తనిఖీ చేసి అక్కడ నిర్మా ణంలో ఉన్న ఎమ్మార్సీ భవనం, భ విత కేంద్రం నిర్మాణ పనులను తని ఖీ చేశారు. భవిత కేంద్రంలో ర్యాం పు, రైలింగ్, టాయిలెట్లు వంటి ము ఖ్యమైన మౌలిక వసతు లు ఏర్పా టు చేసే విధంగా చర్యలు తీసుకో వాలని ఆమె అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్లను ఆదే శించారు.కాగా ప్రాథమిక పాఠశాల లో సుమారు 7.8 లక్షల రూపాయ ల వ్యయంతో తో ఒక హలు, సిడ బ్ల్యూఎస్ టాయిలెట్లనిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలి సిందే.
అనం తరం జిల్లా కలెక్టర్ అనిశెట్టి దుప్పల పల్లి లో నిర్వహి స్తున్న రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేసి భూముల సమ స్యల పరిష్కారానికై స్వీకరిస్తున్న దరఖాస్తులు, సమస్యలు, తది త ర అంశాలను పరిశీలిం చారు. రైతులతో మాట్లాడి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ పరుశురామ్, తదితరులు ఉన్నారు.