Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TelanganaGovernorAssembly : ప్రజల కలలసాకారమే ప్రజాప్రభుత్వం లక్ష్యం

ప్రజల కలలసాకారమే ప్రజాప్రభుత్వం లక్ష్యం

–అన్నదాతల అభివృద్ధికి అనేక ప్ర‌త్యేక కార్యాచరణ
–సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌ డిన ప్రజా ప్ర‌భుత్వం
–అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్రసంగంలో జిష్ణుదేవ్ వ‌ర్మ‌
–బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర‌స‌న‌ల మ‌ధ్య అసెంబ్లీ వాయిదా

TelanganaGovernorAssembly:   ప్రజా దీవెన, హైద‌రాబా ద్‌ : తెలంగాణ‌ సమాజానికి అన్నదాతలే అన్ని రకాల అoడదండల ని, రైతుల కలలు సాకారం చేసేందుకు ప్రజా ప్ర‌భుత్వం అనేక ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ పేర్కొన్నారు. బుధ‌ వారం నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా తొలి రో జు ఉభయ సభలనుద్దేశించి గవ ర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసం గించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే కేంద్రంగా పరిపాలన కొనసాగు తోందని స్పష్టం చేశారు. త‌మ‌ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంద‌ని, అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం, రైతులు, మహిళలు, యు వతకు అన్నివిధాలా సహకారం అందిస్తామ‌ని చెప్పారు. ఈ సంద ర్భంగా గ‌వ‌ర్న‌ర్ చేత రాష్ట్ర ప్ర‌భుత్వం అబ‌ద్ధాలు చెప్పిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందో ళ‌న మ‌ధ్య గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొన‌ సా గింది. గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌సంగం అనంతం అసెంబ్లీని గురు వారానికి వాయిదా వేశారు. గవ ర్నర్ ప్రసంగం యావత్తు ఇలా కొన సాగింది. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని, ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎం దరో కృషి చేశారు. జననీ జయకే తనం రాష్ట్ర గీతంగా చేసుకున్నా మ‌న్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నా మ‌న్నారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోoది.

రాష్ట్రానికి రైతులే ఆత్మ వంటి వారు అని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాము. ప్రజల కోసం నిరం తరం శ్రమించే వాళ్లే అన్నదాతలని, రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగ స్వామ్యం ఉంది. దేశంలో అత్యధి కంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతుల సంక్షేమం కో సం రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందు లో భాగంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం ఇదే త‌మ‌ ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శన‌మ‌ని. 23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించాo.

ఎకరానికి రూ.12 వేల చొప్పున వా రికి అందిస్తున్నామ‌ని, రైతు నే స్తం అమలు చేస్తున్నామ‌ని, స‌న్నాలు పండించే వ‌రి పంట‌కు రూ.50 0 చొప్పున బోనస్ ఇస్తున్నాo. అన్నదాతల కోసం వ్యవసాయ కమి షన్ ఏర్పాటు చేశామ‌ని, ఆరోగ్య శ్రీ పరి ధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాo. పాడి రైతులకు రూ.500 బోనస్ ఇస్తు న్నాం. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకువచ్చిన మహా లక్ష్మి పథకం గేమ్‌ ఛేంజర్‌గా మారింది. ఆర్టీసీకి ఆరు వంద‌ల బ‌స్సు లు అ ద్దెకు ఇచ్చే విధంగా మ‌హిళ‌ల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హించింద‌ని, పేద లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.

రుణమాఫీ కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశామని, రూ. 500కే గ్యాస్ అందజేస్తున్నాం. యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మె రుగు యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరి చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూ నివర్శిటీ ఏర్పాటు చేశాం. ప్యూచర్ సిటీ నిర్మా ణాన్ని తెలంగా ణ ప్రభుత్వం ప్రారంభించిoది. శ్రీశైలం సాగర్ హైవే మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దీనికి కేటాయించామని. ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాo, మెట్రో రైలు సౌకర్యం కూ డా రాబోతుంది.

విద్యా రంగాన్ని కీలక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతోంద న్నారు.రాష్ట్రంలో సామాజిక న్యా యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీల రిజర్వేషన్ల కోసం కుల గణన ను నిర్వహించాo. ఎస్సీ వర్గీకర ణ పై నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, దీని ఆధారంగా ఉద్యోగాల భర్తీ విషయంలో పార దర్శకతను పాటిస్తున్నాo. ఇందు కోసం టీజీపీఎస్సీని బలోపేతం చేశామని తన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.