బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
telanganaicet : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ ఐసెట్ 202 5 నోటిఫికేషన్ విడుద లైంది. జూన్ 8, 9 తేదీల్లో నాలుగు విడతలు గా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగు నున్నాయి. ఇదిలా ఉండగా 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025 నిర్వ హణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్య మండలి నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంకు అప్పగించిన విషయం విధిత మే.
అయితే ఐసెట్ 2025 కు చైర్మన్ గా విశ్వవిద్యాలయ ఉపకు లపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ గా రిజి స్ట్రార్ ఆచార్య అ ల్వాల రవి వ్యవ హరించనున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్లగొండ లో ఐసెట్ 2025 నోటి ఫికేషన్ ను సెట్ చైర్మన్, కన్వీనర్ ఇతర విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో గు రువారం విడుదల చేశారు. జూన్ 8 మరియు 9 తారీ కుల్లో నాలుగు విడతలుగా, తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వ హించనున్నట్లు కన్వీ నర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుండి మే 3వ తారీకు వరకు సమ ర్పించవచ్చున్నారు. 50 రూ పాయల అపరాధ రుసుముతో మే 17 వరకు 500 రూపాయల అప రాధ రుసుముతో మే 26 వరకు ఆన్లై న్ దరఖాస్తు చేసుకోవచ్చ న్నా రు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 550 రూపాయలు, సాధారణ అభ్యర్థు లు 750 రూపాయలు పరీక్ష రుసు ము చెల్లించాలని తెలిపారు. ఆన్లై న్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ కు మే 16 నుండి మే 20 వరకు అ వకాశం కల్పించనున్నట్లు తెలి పారు.
నాలుగు విడతలుగా జరగ నున్న పరీక్షలు ఉదయం 10 నుం డి మధ్యాహ్నం 12:30 వరకు, తిరి గి మధ్యాహ్నం 2:30 నుండి సా యంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు నిర్వహించనున్నా రు.పరీక్ష యొక్క ప్రాథమిక- కీ జూ న్ 21న విడుదల చేయనున్నా రు, ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తె లుపుటకు జూన్ 22 నుండి జూన్ 26 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపా రు. జూలై 7న తుది కీ మరియు పరీక్ష ఫలి తాలను విడుదల చేయ నున్నట్లు ఆచార్య అల్వాల రవి తెలిపారు.
పరీక్షలో సాధారణ అభ్యర్థులకు 25 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత శాతం ఏమీ లేనట్లు, ఉన్నత విద్య మం డలి తీర్మానించినట్లు తెలిపారు. అభ్యర్థులు అర్హతలు, సిలబస్, మో డల్ పేపర్ మరియు ఆన్లైన్ దరఖాస్తు లు వంటి పూర్తి వివరాలకు https://icet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని తెలి పారు. ఐసెట్ 2025, నోటిఫికేషన్ విడుదల సందర్భంగా చైర్మన్, ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తా ఫ్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన పీ- సెట్ మరియు ఎడ్ -సెట్ మాదిరిగానే ఐసెట్ 20 25 సైతం చక్కని అవకాశం గా భా వించి సమర్థతను చాటి చెప్పాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి, డైరెక్టర్, డా రమేష్, డీన్. ఆచార్య బి. సరిత, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచా ర్య ఆకుల రవి, సి ఓఈ. డా. ఉపేం దర్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా వై ప్రశాంతి, ప్రిన్సి పాల్ డా కె శ్రీదేవి, అరుణప్రియ, సుధారాణి, డా సబీ నా హెరాల్డ్, ఆ చార్య అన్నపూర్ణ, డా జక్కా సురేష్ రెడ్డి, డా హరీష్ కుమార్, డా సం ధ్యారాణి, డా ఎస్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.