టియూడబ్లూజే ఉపాధ్యక్షునిగా పొలగోని లక్ష్మీకాంత్ గౌడ్
Telanganajournalistunion: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జ ర్నలిస్ట్స్ (tuwj -143) జిల్లా ఉపాధ్యక్షునిగా పోలగొని లక్ష్మీకాంత్ గౌడ్ నియమితులయ్యా రు. సీని యర్ జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ నియా మ కాన్ని ధృవీకరిస్తూ టీ యూడ బ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ నియామ క పత్రం అందజేశారు.ఆదివారం నల్లగొండ జిల్లా కార్యాల యoలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంత్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు మండలం గట్టుప్పల్ ఆంధ్రజ్యోతి విలేఖరిగా, సీనియర్ జర్నలిస్టు గా పనిచేస్తున్న లక్ష్మీ కాం త్ అనుభవాన్ని, సేవలను జిల్లా స్థా యిలో వినియోగించుకొని tuwj- 143 సంఘాన్ని మరింత బలోపేతానికి వినియోగించుకోవా లన్న ఉద్దే శ్యంతో ఉపాధ్యక్షునిగా నియమిం చినట్లు తెలిపారు. నల్ల గొండ జిల్లా లో యూనియన్ పరంగా గడిచిన పది సంవత్సరాల్లో స్థిరంగా ఉండి జర్నలిస్టుల సమస్యల పరిష్కా రానికి విశేషంగా కృషి చేసిన యూ నియన్ కార్యక్రమాలకు ఆకర్షితులై లక్మికాoత్ యూని యన్ లో చేరి నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా పోలగోని లక్ష్మీ కాంత్ మాట్లాడుతూ తన నియామ కానికి సహ కరించిన జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్ల గొండ జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరి ష్కారంతో పాటు సంఘం బలో పే తానికి శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.
ఈ సమావేశం లో యూనియన్ ఎలక్ట్రాన్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి సల్వా ది జానయ్య, నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు దండంపల్లి రవికు మార్ గౌడ్, నాయకులు వెంకట మధు, రాంప్ర సాద్, శివ, సందీప్, సీనియర్ జర్నలిస్టులు కోడి రాములు, కుం భం ఇంద్రసేనారెడ్డి, మేడి అశోక్, జీడిమడ్ల బాబు, రెడ్డి మల్ల వెంకట్, జిట్టగోని వెంకటేష్, దుబ్బ అనిల్ తదితరులు పాల్గొన్నారు.