Telanganaministers : పేదలకు పేరుపేరునా ప్రభుత్వం శుభవార్త, అర్హులైన అందరికీ అన్నీ
-- అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా --పై పథకాల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవస రం లేదు --ఈనెల 21 నుండి జరిగే గ్రామసభ లలో దరఖాస్తు చేసుకోవచ్చు --రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
పేదలకు పేరుపేరునా ప్రభుత్వం శుభవార్త, అర్హులైన అందరికీ అన్నీ
— అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా
–పై పథకాల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవస రం లేదు
–ఈనెల 21 నుండి జరిగే గ్రామసభ లలో దరఖాస్తు చేసుకోవచ్చు
–రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
Telanganaministers: ప్రజా దీవెన, నల్లగొండ: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరో సా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, జౌళి, మార్కెటింగ్, సహకార శాఖ ల మంత్రి తుమ్మల నాగేశరాష్ట్రలు తెలి పారు.శనివారం హైదరాబాద్ నుండి రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తది తర పథకాలపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీని వాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీఎస్ శాంతి కుమారిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సంద ర్భంగా మంత్రులు మాట్లా డుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు, రైతు భరో సా, ఇందిరమ్మ ఇండ్లు, ఇంది రమ్మ ఆత్మీ య భరోసా పథకాలు అందే వరకు ఈ ప్రక్రియ కొనసా గుతుందని తెలిపారు. అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి పధకాలు అంద చేయు కార్యక్రమం కొనసాగుతూనే వుంటుందని, ఇప్పుడు కొత్త రేష న్ కార్డుల జాభితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందా ల్సి న అవసరం లేదని స్పష్టం చేశారు.
కుల, సామాజిక, ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వీటిల్లో ఎవరైనా పేర్లు రాని వారుంటే ఈ నెల 21వ తేది నుండి జరిగే గ్రామ సభలలో దర ఖాస్తు చేసుకోవాలని మంత్రులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి పధకాలు అంద జేస్తామని, ఇప్పుడు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.
రాష్ట్రం లో అర్హులైన అందరికి రేషన్ కార్డులు అందజే యాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు వివరించా రు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా వ్యవసా య శాఖ అధికారి శ్రవణ్ ,జిల్లా పౌర సరపరాల అధికారి వెంకటేశ్వ ర్లు ,డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.