పోలీస్ కు గౌరవం, ఎస్ఐ కు ఉత్తమ ప్రశంసాపత్రం
Telanganapolice : ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: విధి ని ర్వహణలో ప్రతిభ కనబ రిచిన పోలీస్ లకు గౌరవం లభిం చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోక్ అదాలత్ లో అ త్యధిక కేసులు పరిష్కారం చేసినందుకు బయ్యారం ఎస్ఐ రాజ కుమార్ కు, కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు ప్రభుత్వం తరఫున ఉత్త మ ప్రశంసాపత్రం లభించింది.
ఈ ప్రశంసాపత్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రా చేతుల మీదుగా ఎస్ఐ రా జకుమార్, కానిస్టేబుల్ కిషోర్ అం దుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజకుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లో రాజీ మార్గమే రాజ మార్గమని, సోదరభావంతో స్నేహపూర్వక వాతారణంలో ప్రజ లు జీవించాలని ఆయన కోరారు. అవార్డును ఎస్పీ చేతుల మీదుగా అందుకోవడం తమకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ ను, మణు గూరు డిఎస్పి రవీందర్ రెడ్డి , ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.