Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TelanganapoliceDGP : నేరరహిత తెలంగాణ సమాజమే రాష్ట్ర పోలీసుల ధ్యేయం

నేరరహిత తెలంగాణ సమాజమే రాష్ట్ర పోలీసుల ధ్యేయం

— నేర శాతం తగ్గింపుకు అన్ని విభా గాల పోలీసులు సమన్వయంతో కృషి చేయాలి
–అధికారుల సమీక్షా సమావేశం లో డీజీపీ జితేందర్

TelanganapoliceDGP:  ప్రజా దీవెన, హైదరాబాద్: సమర్థవం తమైన పోలీసు వ్యవస్థలో దేశంలోని టాప్ పది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థా నంలో ఉండడం గర్వకారణమని డీజీపీ జితేందర్ పేర్కొ న్నారు. బు ధవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ రాచ కొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీ పీలు, అదనపు డీసీ పీలు మరియు ఎసిపి స్థాయి అధికారులతో నేరేడ్ మెట్ లోని కమీ షనర్ కార్యాలయం లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అధికారుల నుండి సంబంధిత జోన్లు మరియు అడ్మిన్, ట్రాఫిక్, క్రై మ్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, ఎస్ ఓటి, రిజ ర్వు పోలీస్ వంటి విభా గాల వారీగా నేర నియంత్రణ, కేసుల విచా రణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్య ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్య లను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఉన్నతాధి కారులు క్రమం తప్ప కుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను ప్రత్యక్షంగా సందర్శించి, వారి పనితీరు సమీక్షిం చాలని , తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వాటి ప్రకారం నేర నియంత్ర ణకు కృషి చేయాలని సూచించారు. సమర్థవంతమైన పోలీసు వ్యవ స్థలో దేశంలోని టాప్ పది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండడం గర్వకారణం అని, ఇతర రాష్ట్రాల కంటే తెలం గాణలో శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.

ఇక్కడున్న ఇరవై నాలుగు గంటల పెట్రోలింగ్ గస్తీ వంటి ఏర్పాట్ల ద్వా రా నెలకొన్న ప్రశాంత వాతావరణం వల్లనే మన రాష్ట్ర అభివృద్ధికి ఉప యోగపడే పెట్టుబడులు కూడా అధికంగా వస్తున్నాయని, తల సరి ఆదాయంలో కూడా మన రాష్ట్రం ముందజలో ఉందని పేర్కొ న్నారు.ఇకనుండి రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహిం చాలని, వీలైనంత తక్కువ సమ యంలో బాధితుల వద్దకు చేరుకో వాలని సూచించారు.

నేరస్తులను పట్టుకోవటంలో, నేరపరి శోధనలో, సాంకేతిక ఆధారాల ను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగిం చుకోవాలని అధికా రులకు సూచిం చారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా లను వెంటాడి పట్టుకోవాలని, పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాల ని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీ సుకోవా లని అధికారులను ఆదేశిం చారు. పోలీసులు తమ విధి నిర్వహణ లో పారదర్శకంగా, నిజాయితీ గా, జవాబుదారీతనంతో ఉండాల ని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ప్రజలతో మమేకమై పని చేయా లని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. నూ తన నేర న్యాయ చట్టాల గురించి అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టపరిధిలోనే పని చేయాలని, దర్యా ప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జర గాలని, గరిష్ట శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు.

మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలో పేతం చేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీ ద ఉక్కుపాదం మోపాలని, యువ త మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్య క్రమాలు నిర్వ హించాలని సూచించారు. డిజిటల్ యుగంలో పెరు గుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజ లలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

శాంతి భద్రతల పరి రక్ష ణలో ట్రాఫిక్ విభాగం యొక్క ప్రా ధాన్యతను వివరిస్తూ పట్టణాలు, నగరాల్లో సామాన్య ప్రజలకు ఎక్కు వగా కని పించేది, అందు బా టులో ఉంటూ తక్షణమే స్పందించే అవ కాశం ఉండేది ట్రాఫిక్ పోలీసులకే అని తెలిపారు. ఎండావానలలో, చలిలో సైతం రోడ్ల మీద విధు లు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల వల్లే నగరాల్లో ఎన్నో నేరాలు, రోడ్డు ప్రమాదాలు అదుపులో ఉన్నాయ ని డీజీపీ అభి నందించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ట్రాఫిక్ సిబ్బంది వీలైనంత త్వరగా స్పందిం చి క్షతగాత్రులకు సహాయం చేయా లని సూచించారు.

అన్ని విభాగాల పోలీసులు సమన్వయంతో పని చేయాలని, సమర్థ వంతంగా పని చేసే అధికారులు, సిబ్బందికి రాష్ట్ర స్థాయి పతకాలు, ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ స మావేశంలో సీపీ సుధీర్ బాబు ఐపీ ఎస్, డిసిపి మల్కాజ్గిరి పద్మజ ఐపి ఎస్, డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి క్రైమ్ అర వింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్ఓటి 1 రమ ణారెడ్డి, డిసిపి ఎస్ఓటి 2 మురళీ ధర్, డీసీపీలు ట్రాఫిక్ మల్లా రెడ్డి, శ్రీనివాస్, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, డిసి పి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, పలు వురు అదనపు డీసీపీలు, ఏసి పిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.