Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telanganarationcards : కీలక అప్డెట్, తెలంగాణలో రేషన్‌ కార్డులకు కొత్త రంగులట..?

కీలక అప్డెట్, తెలంగాణలో రేషన్‌ కార్డులకు కొత్త రంగులట..?

Telanganarationcards:  ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలం గాణ రాష్ట్రంలో వచ్చే ఉగాది నుం డి రేషన్‌ కార్డులకు కొత్త రంగులు రూపు ఇవ్వాలని ప్రభుత్వం యో చిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ మార్పులపై చర్చ జరిగినట్లు తెలు స్తోంది. పౌర సరఫరాల శాఖ ఇప్ప టికే పలు డిజైన్లను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. దారిద్య రేఖకు పై న (ఏపిఎల్) కుటుం బాలకు గులా బీ బదులుగా ఆకు పచ్చకార్డులు ( అవసరమైతే మూడు) మంజూ రు చేయనున్నట్లు విస్త్రుత ప్రచా రం అరుగుతోంది. ప్రస్తుతం ఏపీ ఎ ల్ కుటుంబాలకు గులాబీ రంగు రే షన్‌ కార్డులు ఉన్నప్పటికీ త్వరలో వీటిని హరిత (గ్రీన్‌) రంగులోకి మా ర్చే అవకాశం ఉంది.

దారిద్య రేఖ కు దిగువున (బీపీఎల్ ) కుటుంబాలకు మూడు రం గుల (త్రివర్ణ) కా ర్డులను ఇచ్చే యోచనలో ప్రభు త్వం ఉందని విశ్వ సనీయ వర్గాల కథనం. ఇది నూతన విధానంలో భాగంగా ఉండే అవకాశం ఉందని ఒక విదమైన సంకేతాలు వెలువ డుతున్నాయి. అసెంబ్లీలో చర్చ త్వరలో అధికారిక ప్రకటన రేషన్ కార్డుల్లో మార్పు లపై అసెంబ్లీ స మావేశాల్లో సభ్యులు చర్చించారు. త్వరలో ప్రభు త్వం దీనిపై అధి కా రిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పౌరసరఫరాల శాఖ స మగ్ర ప్రణాళిక ఈ కొత్త మార్పుల కో సం పౌరసరఫరాల శాఖ ఇప్పటికే పలు డిజైన్లను రూపొందించింది. వీటిని పరీక్షించిన అనంతరం అమ లుకు ప్రభుత్వం ఆమోదo తెలుపనుంది.

రెండు రకాలుగా ఉంటాయి: మంత్రి ఉత్తమ్ రెడ్డి 

రేషన్‌ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచ నప్రా యం గా తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్‌ కార్డు లు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్‌ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ట్రైకలర్‌లో బీపీఎల్‌ కార్డులను, గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

గురువారమిక్కడ అసెంబ్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లా డా రు. ‘‘రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్‌కార్డుల లబ్ధిదారులుగా ఇప్ప టికే ఉన్నారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇస్తుం ది. కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచాం. ఆ ప్రక్రి య నెలాఖరులోగా అయిపోతుంది. కొత్త రేషన్‌కార్డుల జారీ ఏప్రిల్‌లో ఉండొచ్చు. కొత్తవారితో పాటు ఇప్పటికే కార్డులున్న వారికి స్మార్ట్‌కా ర్డులు జారీచేస్తున్నాం.

గతంలో పింక్‌కార్డులు ఉన్నవారికి గ్రీన్‌కార్డు లు, తెల్లకార్డు ఉన్నవారికి ట్రైకలర్‌ కార్డులు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారాస ప్రభు త్వం ఖర్చుచేసిన రూ.లక్ష కోట్లు రాష్ట్రానికి నష్టం వాటిల్లింది. మూ డు బ్యారేజీల వాడకం విషయంలో గత ప్రభుత్వంలా వ్యవహరిస్తే 44 గ్రామాలు, భద్రాచలం పట్టణం కొట్టుకుపోతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చివరి 50 మీటర్లు ప్రమా దకరమని ఉత్తమ్‌ అన్నారు. అందుకే అక్కడ రోబోలను వాడుతు న్నామని, దీనికి రాతపూర్వక అనుమతి ఇచ్చామని చెప్పారు.

ప్రమాదం జరగకపోతే సొరంగం పనులు రెండేళ్లలో పూర్తయ్యే వన్నా రు. తాను ఇప్పటికే ఏడుసార్లు గెలిచానని, మంత్రిగా ఉన్నానని, మ రే ఆశలు లేవంటూ విలేకరులడిన ప్రశ్నకు ఉత్తమ్‌ బదులిచ్చారు. భాజపా ఎమ్మెల్యే రామారావు పటేల్‌ స్పందిస్తూ మీరు ముఖ్యమంత్రి కావాలిగా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.