ప్రభుత్వం కీలక ప్రకటన, వ్యవసాయ మార్కెట్ల కు ఇసుక విక్ర యం
Telanganasandpolicy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చేం దుకు ఆదాయాన్ని పెంచే మార్గా లు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. శని వారం జరిగిన రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సబ్ కమిటీ స మావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు మాట్లాడారు.
సామా న్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ప్రారంభిం చినట్టు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇసుకను అందుబాటులోకి తీసుకురా వాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదే శించారు. శనివారం ప్రజాభవన్ లో రెవెన్యూ రిసోర్స్ మొబైల్ జేషన్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరగ గా సమావేశంలో మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నా రు.
ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశిం చిన ఇసుక, మైన్స్ శాఖలను అ త్యం త ప్రాధాన్యత కలిగినవిగా వివరించారు. ఇసుకకు సంబంధించి ఐటీ డీఏలతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని మంత్రులు సూచిం చారు. ఆదాయం ఆర్జించే శాఖల్లో లూ పోల్స్ అరికట్టాలని, ప్రభుత్వం నిర్దే శించిన లక్ష్యాన్ని అధికారులు సాధించాలని మంత్రులు సూచిం చా రు. 2025-26 ఆర్థిక సంవత్స రానికి నిర్దేశించుకునే లక్ష్యాలు వాస్త వానికి దగ్గరగా ఉండే విధంగా జాగ్ర త్తలు తీసుకోవాలని మంత్రులు ఆదే శించారు.
హైదరాబాద్ నగ రంలో కాలుష్య కారకమైన పరిశ్రమ లను అవుటర్ రింగ్ రోడ్డు దాటిం చాలని గతంలోని నిర్ణయం తీసు కున్న నేపథ్యం లో ఆ నిర్ణయాన్ని వేగవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్యా బినెట్ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రట రీలు, సెక్రటరీలు ప్రతినెల ప్రగతిని సమీక్షించాలని, ఆ ప్రగతి వివ రాలను ప్రతి మూడు నెలలకు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించా లని ఆదేశించారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ ని, ఈ నేప థ్యంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను విస్తృతంగా అన్వేషిం చాలని ఆదేశించారు. ముఖ్యమం త్రి, మంత్రుల వద్ద ఉన్న ప్రధాన అంశాలకు సంబంధిం చిన విషయాలపై శ్రద్ధ పెట్టి ఉన్నతాధికారులు ఫాలో అప్ చేసుకో వాలని, వాటిని క్యాబి నెట్ ముందుకు తీసుకొచ్చేందుకు చొరవ చూ పాలని తెలిపారు.
సమా వేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, మై న్స్ ప్రిన్సి పల్ సెక్రె టరీ శ్రీధర్, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సి పల్ సెక్రెటరీ ఎస్ఎంఏ రిజ్వి, ట్రా న్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమో హన్, రిజిస్ట్రేషన్ కమిష నర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇండస్ట్రీస్ కమిష నర్ విష్ణువర్ధన్, హౌసింగ్ ఎండి గౌతం, కమర్షియల్ టాక్స్ కమి షనర్ హరిత తదితరులు పా ల్గొన్నారు.