Tenth Grade : ప్రజా దీవెన శాలిగౌరారం : శాలిగౌరారం మండలం లోని ఊట్కూరు, మాదారం,చిత్తలూరు, ఇటుకులపహాడ్,భైరవునిబండ జడ్పి హైస్కూళ్లలో చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యం లో 100 మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, పెన్నులు, స్కేళ్లు ఫాండేషన్ ఛైర్మెన్ యంగలి రామకృష్ణ గౌడ్ పంపిణి చేశారు.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని అయన అన్నారు.. కార్యక్రమం లో ఊట్కూరు, మాదారం, చిత్తలూరు, ఇటుకులపహాడ్,ఎనగందుల వెంకన్న, మహబుబ్ రెడ్డి,ఆర్. జ్యోతి,రామాచారీ, నాంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు నల్లా చక్రపాణి, గంగాధర్,షౌకత్ అలీ ఏడుకొండలు, విద్యా కమిటి ఛైర్మెన్ కళ్యాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.