TGSRTC : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తమిళనాడు లోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఫిబ్రవరి 10 వ తేది సాయంత్రం 7 గంటలకు అన్ని డిపో ల నుండి ప్రత్యేక బస్ లు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి పౌర్ణమి కి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసు లు నడిపిస్తామని అరుణాచలం వెళ్ళే భక్తులకు ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం, తమిళనాడు లోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందని తెలిపారు.మరిన్ని వివరాలకు 9298 00 8888 ను లేదా అన్ని సమీప బస్ స్టేషన్ లలో సంప్రదించాలని పేర్కొన్నారు.