Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Quality Seeds : నాణ్యమైన విత్తనాలు అందించ డoలో డీలర్ల పాత్ర ముఖ్యమైoది

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Quality Seeds : ప్రజా దీవెన,నల్లగొండ జిల్లా : రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో అందించడం లో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపం లోని పానగల్లు రైతు వేదికలో వ్య వసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీల ర్లకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మా ట్లాడారు.

విత్తనం విషయంలో డీలర్లు రైతు లను ప్రలోభాలకు గురి చేయవ ద్దని పారదర్శకత పాటించాలని, ఒకవేళ రైతులను మోసం చేస్తే కఠి న చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు.విత్తనాల విషయంలో డీలర్ల పై ఎలాంటి ఫిర్యాదులు రా కుండా చూసుకోవాలన్నారు. డీల ర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అ వసరమైతే కంప సాగర్ లాంటి వ్య వసాయ పరిశోధన కేంద్రాలలో త నిఖీ చేయించుకోవాలని, వాటి నా ణ్యతను పరీక్షలు చేయించుకోవా లన్నారు రైతులు కూడా వారు పొం దిన విత్తనాలను పరీక్షించుకోవాల న్నారు.

విత్తన డీలర్లు తప్పనిసరిగా షాపు ముందు ప్రభుత్వం నిర్దేశించిన ఎ మ్మార్పీ ధరలకు విత్తనాలను అ మ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చే యాలని, ఖచ్చితంగా ఎంఆర్పి ధ రకే విత్తనాలను ఆమ్మాలని చెప్పా రు. అలాగే నకిలీ విత్తనాలను, ఇ తర ప్రాంతాల నుండి వచ్చి విత్తనా లను అమ్మేవారిని ప్రోత్సహించవ ద్దని, రైతులకు విత్తనాలను అందిం చడంలో ఒక డీలర్ గా కాకుండా, సాటి మనిషిగా ప్రవర్తించాలని విజ్ఞ ప్తి చేశారు. కోరమండల్ ఎరువుల కంపెనీ సహకారంతో ఈ- పాస్ యంత్రాలు అందజేస్తున్నందున కోర మండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్ ను పెంచాలని, ఎక్కడైనా సమ స్య లు వస్తే వెంటనే సమస్యను అధిగ మించే విధంగా కృషి చేయాలని తెలిపారు.విత్తన డీలర్లతో సమావే శం నిర్వహించడం వల్ల శాస్త్రీయ పద్ధతిలో, పారదర్శకంగా రైతులు విత్తనాలు పొందేందుకు అవకాశా లు ఏర్పడతాయని చెప్పారు. విత్త నాలకు సంబంధించిన నివేదికల ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయా లని ఆమె వ్యవసాయ అధికారు లను ఆదేశించారు.

ఈ రబీ సీజన్లో రాష్ట్రంలోనే అత్య ధికంగా ధాన్యాన్ని పండించిన రెం డవ జిల్లాగా నల్గొండ నిలిచిందని , వ్యవసాయ, ఇరిగేషన్, అనుబంధ శాఖలు, డీలర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందని కలెక్టర్ అన్నారు. జి ల్లాలో ఈ రబి సీజన్లో 5 లక్షల 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వ స్తుందని అంచనా వేయగా, ఇప్ప టివరకు 5 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చే శామని తెలిపారు.

జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ వచ్చే వానకాలం జి ల్లాల్లో 11 లక్షల ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగిందని, 5 లక్షల ఎకరాలలో వరి ,5 లక్షల 40 వేల ఎకరాలలో పత్తి, పండించే అవకాశాలు ఉన్నా యని, అయితే వరితోపాటు, ఇత ర పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నా మని, ప్రత్యేకించి 20 వేల ఎకరాల లో కంది సాగు చేసేందుకు ప్రణాళి కలు రూపొందించామని, వీటన్నిటి ని దృష్టిలో ఉంచుకొని డీలర్లు సరై న విత్తనాలను, నాణ్యమైన విత్త నాలను రైతులకు అందించాలని కోరారు. ఈ సీజన్ నుండి ఎరువు లన్నింటిని ఈ పాస్ యంత్రం ద్వా రా ఇవ్వడం జరుగుతుందని, కోర మండల్ ఫర్టిలైజర్ సహకారంతో జిల్లాలోని 973 మంది విత్తన డీల ర్లకు ఈ పాస్ యంత్రాలను అంద జేయనున్నామని తెలిపారు.

కోరమండల్ ఎరువుల కంపెనీ సిజి ఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సం ఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, రా మ్మూర్తి,రవి, రాజేందర్,హర్ష, తదితరులు మాట్లాడారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ వంద మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాల ను పంపిణీ చేశారు.