–నల్లగొండ జిల్లా రెవెన్యూ అదన పు కలెక్టర్ శ్రీనివాస్
Custom Milling : ప్రజా దీవెన, నల్లగొండ: రబీ 2023- 24 కు సంబంధించి మిగిలిపోయిన కష్టంమిల్లింగ్ రైస్(సి ఎం ఆర్) ల క్ష్యాన్ని వారంలోపు పూర్తిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ జిల్లా రైస్ మిల్లర్లతో కోరారు.
గురువారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మంది రంలో జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సి ఎం ఆర్ పై సమావేశం నిర్వహించా రు.
2023- 24 రబీ సీఎంఆర్ కు సం భందించి ఇంకా 73 ఏ సి కే లు చెల్లించాల్సి ఉందని, అందువల్ల రైస్ మిల్లర్లు వారంరోజుల్లో చెల్లించ డంతోపాటు ,2024- 25 రబి కి సం బంధించిన సిఎంఆర్ ను సైతం వేగ వంతం చేయాలని ఆయన కోరారు. సీఎం ఆర్ చెల్లింపులో నిర్లక్ష్యం చే య వద్దని ,జాప్యం లేకుండా ఎప్ప టికప్పుడు చెల్లిస్తే ఇబ్బంది ఉండ దని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు మిల్లర్లు సి ఎం ఆర్ చెల్లిం చాలని కోరారు. పౌరసరఫరాల వి భాగం డిప్యూటీ తహసిల్దారులు ప్రతి రోజు పర్యవే క్షించాలని చెప్పా రు.
జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం,పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ , రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు ,పౌర సరఫరాల శాఖ అధికారులు, ఇతర అధికారులు, తదితరులు, ఈ సమావేశానికి హాజరయ్యారు.