బీజేపీ పతనం… ‘మణిపూర్ ‘ తోనే ప్రారంభం
–పుల్యామా దాడులు సైతం బిజెపి సృష్టే
–ఎన్నికలసమయంలో సంఘ్ పరివార్ ఆడుతున్న నాటకంలో భాగం
–కాశ్మీర్ లో మరో కుట్రకు తెరలేపే వ్యూహం
–కర్ణాటక లో మొదలైన పతనం దేశం లో కొనసాగుతుంది
— బిజెపి విధానాలు విద్యావంతులకే నచ్చడం లేదు
— బి అర్ ఎస్ ముఖ్య శ్రేణుల సమావేశం లో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: బిజెపిదుర్మార్గాలకు మణిపూర్ (manipoor) ఉదంతం పరాకాష్ట గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(jagadeesh Reddy)మండిపడ్డారు.ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్దిపొందాలన్నది బిజెపి వ్యూహంలో(planining) బాగంగా కనిపిస్తుందన్నారు. గడిచిన లోకసభ(loke sabha)ఎన్నికల్లో పుల్యమా ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు. నిజానికి పుల్యామా ఉదంతం బిజెపి(bjp )సృష్టిగా ఆయన చెప్పారు.
ఆదివారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బి ఆర్ యస్ శ్రేణుల ముఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘ్ పరివార్(sangh pariwar) క్రియేటివిటీ లో భాగమే పుల్యామా దాడులుగా ఆయాన అభివర్ణించారు.వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కాశ్మీర్(kasmir)లో మరో రచ్చ సృష్టించేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.
బిజెపి పై దేశ ప్రజల్లో భ్రమలు తొలగడం తో అడ్డ దారిలో మెజారిటీ ప్రజల్లో పొలరైజేషన్(polarisation)సృష్టించి అధికారంలోకి రావాలి అన్నది సంఘ్ పరివార్ ఆలోచన అని ఆయన విమర్శించారు. అయితే దేశవ్యాప్తంగా మోడీ పై ప్రజల్లో మోజు తగిందన్నారు.కర్ణాటక ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు.
మోడీకి వ్యతిరేకంగా పడిన ఓటు అది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ చేసిన రోడ్ షోలకు జనామోదం లభించ లేదన్నారు. ప్రధాని కాకముందు మోడీ(modi )ఎక్కడా రోడ్ షో చేసిన దాఖలాలు లేవన్నారు. బిజెపి విధానాలు సామాన్యులకే కాకుండా విద్యావంతులకూ నచ్చడం లేదన్నారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్(congress)బలహీన పడిందన్నారు. చెడగొట్టే వాడి కంటే ఏమీ చేయలేని వాడే బెటర్ అనుకుని అక్కడ కాంగ్రెస్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు. అదీను ఎంతో కాలం నిలబడ లేదన్నారు.ఎన్నికల(elections)హామీలు అమలు పరచడంలో అధికార పార్టీ అప్పుడే విఫలమైందన్న ఆరోపణలు రావడం గర్హనీయమన్నారు.