The entire village is under flood..! గ్రామo మొత్తం వరధ ముంపు లోనే..!
-- భూపాలపల్లి జిల్లా మొరంచ లో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
గ్రామo మొత్తం వరధ ముంపు లోనే..!
— భూపాలపల్లి జిల్లా మొరంచ లో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
ప్రజా దీవెన /జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి, పరకాల ప్రధాన రహదారి (national hiway)పై మొరంచ లో దాదాపు 15 అడుగుల ఎత్తులో నీరు చేరడంతో ఊరుకు ఊరు మొత్తం నీట మునిగిoది.
దీంతో స్థానిక ప్రజలoదరూ బస్టాండ్ ఆవరణలో గల ఒక పెద్ద భవంతి( upper bilding ) పై తలదాచుకొని దానిపైనే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షo (rain)లోనే గడుపుతూ బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. ప్రభుత్వము (government), సంబంధిత అధికారులు(officers )తక్షణమే స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని ప్రస్తుతానికి ఎలాంటి ఆసరా లేకుండా భయంతో బతుకుతున్న ప్రజలు వేడుకుంటున్నారు.
దుముకుతున్న మత్తడులు…ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గణపురం(ganapuram)మండల కేంద్రం లోని ఘణప సముద్రము 30ఫీట్ల సామర్థ్యం నిండి 4ఫీట్ల ఎత్తులో నించి మత్తడి దూకుతుంది. భూపాలపల్లి (bhupalapally) జిల్లా మొరంచ ప్రభావిత ప్రాంతమైన మోరంచ పల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది.
దీంతో గ్రామంలో ఉన్న స్లాపులపై ఎక్కి సహాయం కోసం చూస్తున్నారు.పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై 353సీ మోరంచపల్లి వద్ద వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గణపురం మండల కేంద్రం నుంచి అప్పయ్య పల్లికి వెళ్లుదారిలో గల మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గత నాలుగు రోజులుగా మండల కేంద్రానీతో రాకపోకలు నిలిచిపోయాయి.