The government should give up its stubborn attitude ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
-- జిపి కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తాం -- citu, JAC నేతల హెచ్చరిక
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
— జిపి కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తాం
— citu, JAC నేతల హెచ్చరిక
ప్రజా దీవెన/నల్లగొండ: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆలోపు పిఆర్సి జీవో 60 ప్రకారం 19 వేల కనీస వేతనం అమలుకై సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని లేదంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.జేఏసీ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నల్లగొండ కలెక్టరేట్ ను వేలాది మంది కార్మికులతో ముట్టడించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు.
22 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా పోటీ కార్మికులను పెట్టి నిర్బంధం ద్వారా సమ్మెను అనుచాలని చూస్తే మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కెవిపిఎస్,ఐద్వా, వృత్తిదారుల సంఘాలు, పి వై ఎల్, తెలంగాణ విద్యావంతుల వేదిక సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాలడుగు నాగర్జున, పాలడుగు ప్రభావతి,గంజి మురళీధర్,ఇందూరి సాగర్, పందుల సైదులు జిపి కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కలెక్టరేట్ ముట్టడికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే కనీస వేతనం19 వేలు అమలు చేయాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ప్రమాదకరమైన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శి గా నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీరాజ్ కమిషనర్,కలెక్టర్,డిపిఓ, ఎంపీడీవో,పంచాయతీ కార్యదర్శి,సర్పంచులకు వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే సమ్మెలోకి వెళ్లామని అన్నారు.కార్మిక సమస్యలు పరిష్కరించకుండా అధికారులు అదిరించి బెదిరించి సమ్మెను విచ్చిన్నం చేయాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోటీ కార్మికులను పెడితే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జేఏసీ జిల్లా చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ22 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే అత్యవసర సేవలు మంచినీళ్లు, వీధిలైట్ల నిర్వహణను నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి నరసింహ,సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శులు దండంపెల్లి సత్తయ్య నారబోయిన శ్రీనివాస్ నల్ల వెంకటయ్య ఏర్పుల యాదయ్య కానుగు లింగస్వామి జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, జేఏసీ జిల్లా కో కన్వీనర్ పోలే సాంబయ్య, పొన్న అంజయ్య,యన్ నరసింహ, పి సర్వయ్య, ఏర్పుల సైదులు,ఎండి జహీర్,ఎర్ర అరుణ, యాదమ్మ కళావతి రామలింగయ్య,ఎల్లేష్ ,కె రాములు తదితరులు పాల్గొన్నారు.