ప్రజా దీవెన, కోదాడ: గణేష్ (Ganesh) నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం (Food Donation) నిర్వహించడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల (Samineni Pramila), రమేష్, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డిలు అన్నారు. గురువారం కోదాడ (Kodhada) పట్టణంలోని కాన్వాసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.
అన్నదానం సందర్భంగా కమిటీ సభ్యులు 31 కిలోల స్వామి వారి లడ్డు (Laddu)ను వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో గుడుగుంట్ల. రఘునాథ్, సాయి వాసునారాయణలు 35,023 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి లడ్డు వేలంలో గెలుపొందిన వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, గట్ల కోటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కాన్వసింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పిన్నపురెడ్డి వీరారెడ్డి,ఉపాధ్యక్షులు ఆగిర్ మధు, సెక్రటరీ కొత్త రాజారావు, కార్యదర్శి తెల్లూరి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి అప్పన సతీష్ తదితరులు పాల్గొన్నారు.