The RTC bus overturned: అదుపుతప్పి బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు
-- ఇద్దరు ప్రయాణికుల దుర్మరణం -ఆగిఉన్న లారీ డీకొట్టిన మరో ఆర్టీసీ బస్సు
అదుపుతప్పి బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు
–ఇద్దరు ప్రయాణికుల దుర్మరణం
—ఆగిఉన్న లారీ డీకొట్టిన మరో ఆర్టీసీ బస్సు
ప్రజా దీవెన/ యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో సాఫీగా ముందుకు సాగుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఓ గుంతలో పడిపోవడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొడ్డుగూడెం గ్రామ శివారులో తొర్రూరు డిపోకు చెందిన ఏపీ 36 జెడ్ 0197 నంబరు గల ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తొర్రూరు నుంచి జగద్గురు గుట్ట వైపు వెళ్తున్న బస్సు బొడ్డుగూడెం శివారు కంచనపల్లి స్టేజి సమీపంలో అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయింది.
ఈ ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిన్న పడిశాల గ్రామానికి చెందిన చుక్క యాకమ్మ (50), కొండ రాములు (60) లు ఇద్దరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగిఉన్న లారీ డీకొట్టిన ఆర్టీసీ బస్సు…కామారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని టేక్రియాల్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని ఆర్టీసి రాజధాని బస్సు ఢీకోట్టింది. లారీ టైరు పంక్చర్ కావడంతో లారీని రోడ్డుపై నిలిపారు.
అదే సమయంలో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టిసి రాజదాని బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ద్వంసం కాగా ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు, పది మందికి స్వల్పగాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసి బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సంఘటన స్థలానికి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పోలిసులు చేరుకోని కేసుని నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.