Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

The whole town is ‘happy’ ఊరంతా ‘సంతోషo’

--ప్రాణాలకు తెగించిన లైన్ మెన్ --వరదను సైతం ఎదురించి విధి నిర్వహణ -- నీళ్లల్లో విద్యుత్ స్థంభం ఎక్కిన వైనం -- ధైర్యసాహాలతో ఊరికి విద్యుత్ సరఫరా -- గ్రామస్థుల మన్ననలందుకున్న సంతోష్ గౌడ్

ఊరంతా ‘సంతోషo’…!

ప్రాణాలకు తెగించిన లైన్ మెన్
–వరదను సైతం ఎదురించి విధి నిర్వహణ
— నీళ్లల్లో విద్యుత్ స్థంభం ఎక్కిన వైనం
— ధైర్యసాహాలతో ఊరికి విద్యుత్ సరఫరా
— గ్రామస్థుల మన్ననలందుకున్న
సంతోష్ గౌడ్

పెద్దమొత్తం వరద నీటి మధ్యలో విద్యుత్ లైన్ వైరు తెగిపోవడంతో గ్రామంలో పూర్తి గా కరెంటు లేకుండా పోయింది. సదరు విషయాన్ని తెలుసుకున్న హెల్పర్ ఏ మాత్రం వెనుకాడకుండా వరద అన్న భయం లేకుండా ప్రమాదకర జలాలను ధైర్యంగా ఎదుర్కొని కరెంటు స్తంభం వద్దకు నీటిలో ఈదుతూ తన స్వప్రయోజనాలను పణంగా పెట్టి విద్యుత్ స్థంభం పైకి ఎగబాకి దెబ్బతిన్న విద్యుత్ తీగను మరమ్మత్తు చేసి గ్రామం మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను పునరుద్ధరించాడు.

విపత్కర పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం ఉన్నా ఏ మాత్రం వెనుకడుగు చేయకుండా సంతోష్ యొక్క నిస్వార్థ సేవా గ్రామస్తుల హృదయాలను గెలుచుకుంది. యావత్ గ్రామస్థులు సమస్యను పరిష్కరించడంలో సంతోష్ గౌడ్ అంకితభావo, సంకల్పాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామం మొత్తానికి విద్యుత్ వెలుగులు తెచ్చి పెట్టిన సంతోష్ గ్రామ ప్రజల అభినందనల వెల్లువలో ప్రశంసలు అందుకున్నారు.