అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు: యేసయ్య
Mothers Love : ప్రజాదీవెన, కోదాడ : అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఈ సృష్టిలో ఏదీ లేదు అమ్మ ప్రేమ తేనెకంటే తీయదని స్వచ్ఛమైనదని కోదాడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ యేసయ్య అన్నారు ఆదివారం పట్టణంలోని స్థానిక నయా నగర్ నందు గల బాప్టిస్ట్ చర్చిలో మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యురాలు ఒంటిపాక జానకి యెసయ్య పాల్గొని సంఘంలో ఉన్న తల్లులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మాతృమూర్తికి మించిన దైవం ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చే సంతోషించేది ఒక్కమాతృమూర్తి అని గుర్తు చేశారు క్రైస్తవ తల్లులు తమ పిల్లల అభివృద్ధికి మంచి ప్రవర్తన కోసం.
ప్రత్యేక ప్రార్థనలు చేస్తురని తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు, సీత , జగ్గునాయక్, మేరమ్మ, లలితాంబ ,భారతమ్మ, స్రవంతి ,సువార్తమ్మ ,గురవమ్మ, మెరీనా రాణి, సలోమి తదితరులు పాల్గొన్నారు