అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు
రాపర్తి నాగమ్మ ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్
మదర్స్ డే సందర్భంగా ఆర్ఎన్ ఫౌండేషన్ రాపర్తి బేబీ స్టూడియో ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
Mother’s Day : ప్రజాదీవెన, సూర్యాపేట :అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు అమ్మ ప్రేమ లో స్వార్థం ఉండదని రాపర్తి నాగమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ దుర్గ ఫోటో స్టూడియో అధినేత రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం మదర్స్ డే సందర్భంగా రాపర్తి నాగమ్మ ఫౌండేషన్ రాపర్తి బేబీ స్టూడియో ఆధ్వర్యంలో సూర్యాపేట పాత బస్టాండ్ ఎదురుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా తమ తల్లిని గుర్తుకు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ పిల్లలకు సేవా కార్యక్రమంలో ప్రోత్సహిస్తూ ఎలాంటి శుభకార్యం జరిగిన ఆరోజున సహాయం అందిస్తూ ఇతరులకు సేవ చేసే విధంగా అందరూ ఉండాలని మాట్లాడం జరిగింది .
.ఈ కార్యక్రమంలో రాపర్తి మన్సూర్ గౌడ్, మాందాస్ అభిరామ్, సాయిరాం, రాపర్తి చరణ్, నందిని, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు