పెద్దపల్లి జిల్లాలో దొంగల హల్చల్
Thieves of Natu chickens: ప్రజాదీవెన, సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నాటు కోళ్ల దొంగలు Thieves of Natu chickens) ఎక్కువయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. 30 కోళ్లను ఎత్తుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సుల్తానాబాద్ (Sultanabad)కు చెందిన ఆరేల్లి చంద్రయ్య (Aarelli Chandraiah)అనే వ్యక్తి తన పొలం వద్ద ఓ షెడ్డులో 100 నాటు కోళ్లను పెంపకం చేపట్టాడు. అయితే రాత్రి, పగలు తేడా లేకుండా కొంతమంది దొంగలు నాటు కోళ్లను చోరీ చేస్తున్నారు. అపహరించిన కోళ్లను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మరి కొన్ని నాటుకోళ్లతో పార్టీ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 30 కోళ్లను ఎత్తుకెళ్లారని బాధితుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.