Mulugu district ములుగు జిల్లాలో నలుగురు మృతి
-- మొత్తంగా ఏడుగురు గల్లంతు -- మరో ముగ్గురి కోసం గాలింపు
ములుగు జిల్లాలో నలుగురు మృతి
–మొత్తంగా ఏడుగురు గల్లంతు
–మరో ముగ్గురి కోసం గాలింపు
ప్రజా దీవెన/ములుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్ నగర్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జంపన్నవాగులో ఏడుగురు గల్లంతు కాగా నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ఉధృతిలో గల్లంతైన ముస్లిం కుటుంబ సభ్యుల్లో నలుగురు విగతజీవులై కనిపించడంతో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలుముకున్నాయి. మొత్తంగా ఏడుగురు గల్లంతు కాగా నలుగురి మృతదేహాలు లభించగా తల్లి ఫౌజియా(35) ఇద్దరు కుమారులు సద్దాం హుస్సేన్ (2), తన్వీర్ అలీ(4) లుగా గుర్తించారు. ఫౌజియా, సద్దాం హుస్సేన్ ఆచూకీ కోసం రెవిన్యూ, పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా మృత దేహాలు లభ్యం కాగా ఈ సంఘటన కు సంబంధించి సమాచారం ఆలస్యంగా వెలుగు చూసిoది. అయితే మరో ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి కరెంటు తీగలకు తగిలి వేలడబడ్డ గుర్తుతెలియని యాచకుడి మృతి దేహం లభ్యమయ్యింది.