Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thumala Nageshwarao: సీతారామ ట్రయల్ రన్ సక్సెస్

–గోదావరి వద్ద మంత్రి తుమ్మల పూ జలు
–అధికారులు, ఇంజనీర్లకు మంత్రి అభినందనలు

Thumala Nageshwarao:ప్రజా దీవెన, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు (sitarama project)ప్రారంభానికి సిద్ధమవుతోంది. గురువారం నిర్వ హించిన ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్ రన్లో (tail rano)విడిచి పెట్టా రు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (kothagudam)అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (thumala nageshwarao)అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్ రన్ ను పర్యవేక్షిం చారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టుకు సంబంధించిన పక్రియను పూర్తి చేసి ప్రారంభించాలని ప్రభు త్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టు గానే ముందస్తుగా ట్రయల్ నిర్వ హించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల సమక్షంలో సీతారామ ట్రయల్ రన్ విజయవంతం జరి గింది. ఉమ్మడి ఖమ్మంలోని సుమా రు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించి అశ్వాపు రంలో సీతారామ ప్రాజెక్ట్లు మంత్రి తుమ్మల లాంఛనంగా ప్రారంభిం చగా ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది.

దీనికి సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం చేపట్టారు. మొదటి పంపు నుంచి గోదావరి (Godavari)నీళ్లు ఎగసి పడుతుంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆనందం తో ఉబ్బితబ్బిబ్బైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(thumala nageshwarao)భూమాతకు ప్రణ మిల్లారు. ఎన్నో ఏళ్ల ప్రజల కల నెర వేరే సమయం ఆసన్నమైందన్న మంత్రులు వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. తన చివరి కోరిక ఖమ్మం(khammam)జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందివ్వడమేనని అది నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టులో భాగమైన ఇంజనీర్లకు, భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. 2004 కంటే ముందే దీనికి ప్రతిపా దనలు సిద్దమైన రూపుదాల్చలేదు. 2016 ఫిబ్రవరి 16న కేసీఆర్ సీఎం (KCR)హోదాలో శంకుస్థాపన చేశారు. కాం గ్రెస్ హయాంలో పనులు పూర్తి అ య్యాయి. గత కేసీఆర్ ప్రభుత్వం లో 17 వేల కోట్ల అంచనాతో ప్రతి ష్టాత్మకం గా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. గురువారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజె క్టు పంప్ పంప్ హౌస్ (pump house)లో పాల్గొని అధికారులతో కలసి పంప్ హౌస్ మోటార్ల పనితీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ వద్ద గోదావరికి మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా నీటిపారు దల శాఖ అధికారులను అభినందిం చారు. ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుం ది. ఇదిలా ఉండగా సీతారామ సక్సెస్ తర్వాత రాజకీయ ప్రకటన లు ప్రారంభమయ్యాయి.సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదంటే, మాదే అంటూ మీడియాకు ఎక్కిన కాంగ్రె స్, బిఆర్ఎస్ నేతల పరస్పర ప్రకట నలు చేసుకోవడం గమనార్హం. సీ తారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజ యవంతం అవ్వడoపై మాజీ మం త్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశా రు. తెలంగాణ నీటిపారుదల విభా గంలో కేసీఆర్ చేసిన కృషి మరో ఉదాహరణగా ఈ ప్రాజెక్టను చూపిం చారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ఇంజినీర్ల కు, అధికారులకు, ఏజెన్సీలకు, ప్రజాప్రతినిధుల కు శుభాకాంక్షలు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కల నెరవేరిందని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ పై బీఆర్ఎస్ (brs) పార్టీ ట్వీట్ చేసింది. ‘ఉమ్మడి పాల కుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగా ణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమవుతు న్న తరుణం, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనా తో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మో టార్ల ట్రయల్ రన్ సక్సెస్. గంగమ్మ జల సవ్వడులతో తడిచిన ఖమ్మం నేల. ఉమ్మడి ఖమ్మం మహబూబా బాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు అందనున్న సాగు నీరని అభివర్ణిం చింది. 2014 లోనే రూ.3000 కోట్ల తో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమి షన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18, 500 కోట్లకు పెంచి పదేండ్లు ఆల స్యం చేస్తిరని అంటూ కాంగ్రెస్ విమ ర్శలు చేసింది. ప్రాజెక్టుకు అవసరం అయిన అనుమతుల్లో, భూ సేకర ణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, మీ రు మాత్రం అందినకాడికి దోచుకుం టారని పేర్కొంది. ప్రజా ప్రభుత్వం వచ్చాక, జనవరి 7 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (thumala nageshwarao) ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష నిర్వహించి, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ మొదలుపె ట్టారు. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జల కళ అంటూ ఎదురుదాడికి దిగింది. మీకు తెల్సిందల్లా అవినీతితో ఆగ మాగం ప్రాజెక్టులు కట్టి, పడగొట్ట డం, పంపుహౌజులను కట్టి, వరద తో ముంచెత్తడం, మంచి చేసే వారి పై దుష్పచారాలతో బురద జల్లడం అని విమర్శించింది. ఇప్పడు చెప్పు కాంగ్రెస్ వస్తే ఏమొచ్చే ఎగిసిపడే గోదావరమ్మ జల కల వచ్చే తెలం గాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే అని పేర్కొంది.

ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేప ట్టారు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలోనే 70 శాతం పూర్తయ్యా యి. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందనుంద ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు చూపుతో ఇదంతా సాధ్యం అయిందన్నారు. అయితే కేటీఆర్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చిం ది. 2014 లోనే రూ.3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేళ్లు ఆలస్యం చేశా రని కాంగ్రెస్ ఆరోపించింది. మా ప్రభుత్వం వచ్చాక జనవరి 7, 202 4 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెల్లలో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారం భించారని పేర్కొంది. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జలకళ అని పేర్కొంది. ఇప్పుడు చెప్పు.. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చే, ఎగిసిపడే గోదావరమ్మ జల కళ వచ్చే, తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి, మొత్తానికి ఆ ప్రాజెక్టు ట్రయల్ రన్ను గురువారం నిర్వహించగా, విజయ వంతమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మరో స్వప్నం సాకార మైన క్షణమిదని కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజు ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు తన గుండెకాయ అని కేసీ ఆర్ గతంలోనే ప్రకటించిన విషయా న్ని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కరువును శాశ్వతం గా పారదోలే వరప్రదాయినికి కేసీ ఆర్ జీవం పోశారని కొనియాడారు.

సీతారామ ప్రాజెక్టు పనులను శరవే గంగా పరుగులు పెట్టించి, పటిష్ట ప్ర ణాళికను తయారు చేసి యుద్ద ప్రతిపాదికన అమలు చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఇక ఖ మ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ధోకా లేదు, దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు అని కేటీ ఆర్ పేర్కొన్నారు. కాలమైనా, కాక పోయినా పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు రాను న్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కలను సాకారం చేసి ఈ జలవిజయంలో భాగస్వాములైన నీటిపారుదల అధికారులు, సిబ్బం దికి అభినందనలు, కష్టపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞ తలుజై తెలంగాణ జై సీతారామ ప్రా జెక్టు అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో (tweet) పేర్కొన్నారు.