Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Thummala Veera Reddy : సిపిఐఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

25న సంగారెడ్డి లో బహిరంగ సభ

Thummala Veera Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :  సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని 25న గొప్ప బహిరంగ సభ జరుగుతుందని అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్టీసీ కాలనీలో సిపిఎం రాష్ట్ర మహాసభ జయప్రదం కోసం సిపిఎం జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ సిపిఎం ప్రజా సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు రాష్ట్రంలో ప్రాజెక్టుల సమస్యలు భూమిలేని నిరుపేదల సమస్యలు కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రక్షణకై ఉద్యమాలు కొనసాగిస్తుందని అన్నారు సిపిఐఎం జాతీయ గుర్తింపు కలిగిన పార్టీ నిరంతరం పేదలు కార్మికులు ఉద్యోగులు కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ప్రజాస్వామ్యం లౌకిక విధానం సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమిస్తున్న పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు.

 

 

ఈ మహాసభల్లో రాష్ట్రంలోని ఆర్థిక సామాజిక అంశాలు కార్మిక కర్షక పేదలు మహిళలు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామికరంగాన్ని వ్యవసాయరంగాన్ని దివాలా తీయించాయని విద్య వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందని ఆయన అన్నారు ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించి దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని ఈ సభలు జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

ఆర్టీసీ కాలనీ సిపిఎం శాఖ కార్యదర్శి కారంపూడి రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ,జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, తుమ్మల పద్మ, సీనియర్ నాయకులు బాణాల పరిపూర్ణ చారి, అనంతుల శంకరయ్య పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి గాదే నరసింహ, గుండాల నరేష్, సలివొజు సైదాచారి, అవుట రవీందర్, కార్తీక్ శాఖ సభ్యులు ఒట్టికోటి కాశయ్య చినపాక మంజుల, జయశ్రీ ఉమారాణి, బాలు ,మౌనిక సంతు ,అంతమ్మ ,కవిత తదితరులు పాల్గొన్నారు.