*సంతను పరిశీలించిన నూతన చైర్ పర్సన్,వైస్ చైర్మన్, డైరెక్టర్లు
*సంతకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి తిరుపతమ్మ
Tirupatamma : ప్రజా దీవెన,కోదాడ: వ్యవసాయ మార్కెట్ లో రైతులు,వ్యాపారస్తులు నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.ఆదివారం కోదాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను వైస్ చైర్మన్ బషీర్,డైరెక్టర్లతో కలిసి పరిశించిరైతులతోమాట్లాడారు .
మార్కెట్ యార్డ్ లో తాగునీరు తోపాటు పశువులకు,వ్యాపారస్తులకు,రైతులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మార్కెట్ లో సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. అనంతరం చిలుకూరులో గల గోదాంకు దారి లేదని రైతులు ఆమె దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తామని తెలిపారు .రైతులు వాహనాలలో ఆవులను,గేదెలను తీసుకువెళ్తున్నప్పుడు పోలీసు వారు ఆపి ఇబ్బంది పెడుతున్నారని,కొంతమంది బజరంగ్దళ్ వాళ్ళమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చైర్ పర్సన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు.
అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్,డైరెక్టర్లు వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు,శ్రీను,వీరబాబు,సూర్యం,దైవమని,వేణు,కోటయ్య,అమర్ సింగ్,శ్రీను,సెక్రటరీ రాహుల్ మార్కెట్ కమిటీ సిబ్బంది,రైతులు తదితరులు ఉన్నారు.