Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TNGOs Union : టీఎన్జీవోస్ యూనియన్ నల్గొండ డైరీ ఆవిష్కరణ

TNGOs Union : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టరేట్లో ఉదయా భవన్లోని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి,ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చూడాలని అన్నారు. నల్గొండలో ఉన్న ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధికారులు రాజకుమార్, డిపిఓ వెంకయ్య, బీసీ డి సి డి ఓ కాజా, టీజీవో అధ్యక్షులు శ్రీనివాస్, సందీప్ రెడ్డి జిల్లా కోశాధికారి జయరావు, అసోసియేట్ అధ్యక్షులు రాజు అధ్యక్ష కార్యదర్శులు, టిఎన్జీవోస్ అధ్యక్షులు నాగిళ్ళ మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ చారి, ఈసీ మెంబర్ విజయ్ తదితరులు ఫాల్గున్నారు.