Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tourism place Sagar budhavanam : పర్యాటకులకు ఆహ్లాదం, బుద్ధవనం పరిసరాల్లో స్టార్ హోటల్ 

 

పర్యాటకులకు ఆహ్లాదం, బుద్ధవనం పరిసరాల్లో స్టార్ హోటల్ 

ప్రజా దీవెన, నాగార్జున సాగర్:నాగార్జునసాగర్ బుద్ధవనం ( bud havanam) పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వా మ్యం లో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (minister juupally Krishna Rao) తెలిపారు. శుక్ర వారం అయన నల్గొండ జిల్లా నా గార్జునసాగర్ వద్ద ఉన్న బు ద్ధవ నం పరిసర ప్రాంతాలను శ్రీ రా మ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్య క్షులు కమలేష్ డి.పటేల్ (దాజి ) తో కలిసి పరిశీలించారు.

ముందుగా విజయ విహర్ లో బుద్ధవనం లే-అవుట్, విజయ విహార్ లేఔట్ల ను పరిశీలించారు. మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపిం చి ఉన్న బుధవనంలో ఉన్న విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (State Tourism Developm ent Corporation) ఎండి .ప్రకాష్ రెడ్డి, బుద్ధవనం కన్స ల్టెంట్ శివనా గిరెడ్డిలు మంత్రికి వివరించారు. నా గార్జునసాగర్ ,బుద్ధవనానికి ఆసి యా(asia) ఖం డంలోని పలు దేశా ల నుండి బౌద్ధులు ఇక్కడికి వస్తారని ,ప్రత్యే కిం చి శ్రీలంక, ఇతర ఆసి యా ఖండాల నుండి ఎక్కువ మంది వస్తా రని ,వారికి అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉం దని ,అప్పుడు ఇంకా ఇతర దేశాల నుండి సైతం బౌద్ధులు (Bu ddhists) ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు.

బుద్ధవనం పరిసర ప్రాంతాలతో పాటు, విజయ విహార్ లో ఉన్న స్థలం వివరాలు, అలాగే నాగార్జు నసాగర్ చుట్టుపక్క ల ఉన్న ప్రభు త్వ భూముల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అందుబా టులో ఉన్న ప్రభుత్వ భూములపై ( government lands) సర్వే నిర్వ హించి వివరాలు సమ ర్పించాలని ఈ సంద ర్భంగా మం త్రి మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారా యణ్ అమిత్ ఆదేశించారు. అనంతరం మంత్రి, దాజితో కలిసి బుద్ధ వనం పక్కన ఉన్న విప స్య న ధ్యాన కేంద్రం పరిసర ప్రాంతాలను, ఇతర ప్రదేశాలను పరిశీ లిం చారు.ఆ తర్వాత స్థానిక శాసన సభ్యు లు కె.జయవీర్ క్యాంపు కా ర్యాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

నాగార్జున సాగర్ ను అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేకించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పర్య టకశాఖ తరఫున చర్య లు తీసుకుంటు న్నామని తెలి పారు. బుద్ధ వనం చూడడానికి ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ఆషియా దేశా ల నుండి ఎంతో మంది భౌద్దులు ఇతరు లు వస్తు న్నారని,ఈ ప్రాంతాన్ని పర్యాటకం గా అభివృద్ధి చేయ డం లో భాగంగా సౌకర్యాలను క ల్పించేందుకు, ముఖ్యంగా బుద్ధ వనం పరిసర ప్రాంతాలలో ప్రభు త్వ, ప్రైవేటు భాగ స్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మా ణం, నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ లో వాటర్ స్పో ర్ట్స్ ( W ater sports) ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ సమీపం లో ఉన్న రామచంద్ర మి షన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాజి తో కలిసి సందర్శించినట్లు తెలిపారు.

స్టార్ హోటల్, వాటర్ స్పోర్ట్స్ తో పాటు, ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి అందుబా టులో ఉండే విధంగా కాటేజీల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, నా గార్జునసాగర్ తో పాటు, నాగార్జు నసాగర్ ( nagarjuna Sagar ) నియోజకవర్గంలో నూటికి నూరు శాతం పెద్ద ఎత్తున టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించా రు. అంతకుముందు విజయ్ విహార్ లో స్థానిక శాసనసభ్యులు కే.జ యవీర్( mla jayaveer) మాట్లాడుతూ నాగార్జునసాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేం దుకు మంచి అవకాశాలు ఉన్నా యని, ప్రత్యేకంగా కృష్ణా నది సమీ పంలో ఉండడం, కొండలు ,ఇక్కడ పరిసరాలు, బుద్ధవనం పర్యా టకంగా అభివృద్ధి చేసేందుకు మం చి ఆస్కారం ఉందన్నారు.

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎం డి ప్రకాష్ రెడ్డి, ఓఎస్ డి. సూధన్ రెడ్డి, బుద్ధిష్ట్ కన్సల్టెంట్ శివనా గిరెడ్డి, బుద్ధవనం డిజైనర్, ఇంచార్జ్ శ్యాంసుందర్, మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు ఉన్నారు. ఆ నంతరం మంత్రి బుద్ధవనం సంద ర్శించారు.బుద్దిస్ట్ కన్స ల్టెంట్ శివ నాగిరెడ్డి బుద్ధవనం విశేశాలను మంత్రికి వివరించగా టూరిజం ఎం డి ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నా రు.

Tourism place Sagar budhavanam