Tourism : ప్రజా దీవెన, హైదరాబాద్:గ్రామీణ,గిరిజన, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే నిర్వహణకు పర్యాటక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ధర్తి ఆబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ” అనే పథకంలో భాగంగా పర్యాటక ప్రాంతాలు, గ్రామీణ గిరిజన ప్రాంతాల కు వచ్చే పర్యాటకులకు ఇంటిలోనే తాత్కాలిక నివాస యోగ్యం కల్పించే హోమ్ స్టే కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వారికి స్థానికంగా నివాసం కల్పించడమే కాకుండా వారికి స్థానిక ఆహారం అందించి పర్యాటక అనుభూతిని కలిగించాలి. పర్యాటక ప్రదేశాలు ఉన్న ట్రైబల్ విలేజ్ లను అభివృద్ధి చేయడంలో భాగంగా హోమ్ స్టే నిర్వహణను ప్రోత్సహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విధానాల ప్రకారం తెలంగాణ టూరిజం హోం స్టే ఎస్టాబ్లిష్ మెంట్ సదుపాయాల కొసం ఈ దరఖా స్తు లనుఆహ్వానిస్తోంది.పర్యాటకులకు అన్నీ సదుపాయాలతో కనీసం గా ఒక గది మొదలు పది గదుల వరకు స్టే ఇవ్వగలగాలి. హోమ్ స్టే విధి విధానాలు, ఇతర మరిన్ని వివరాల కోసం
www.telanganatourism.gov.in అనే వెబ్సైట్ లో, హనుమకొండ కలెక్టరేట్ లోని పర్యాటక శాఖ కార్యాలయంలో లేదా 9866919131 లో సంప్రదించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి తెలిపారు.