–నేపాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ అండర్ 14- లో గోల్డ్ మెడల్.
–మట్టిలో మాణిక్యాన్ని ప్రోత్సహిం చాలని కోరుతున్న క్రీడాభిమానులు.
Tournament : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామానికి చెందిన మొహమ్మద్ ఖాదర్-అంజుమ్ కుమారుడైన మహమ్మద్ ఒసమా ఖాదర్ నేపాల్ లో గురువారం జరిగిన ఇంటర్నేష నల్ ఫుట్ బాల్ మ్యాచ్ అండర్-14 లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2024 ఉత్తరాఖండ్ లో జరిగిన అండర్ 14 ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టలను నలు దిక్కులకు చాటాడు.
అండర్- 14 ఫుట్ బాల్ లో సత్తా చాటుతూ దేశ ఖ్యాతిని తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలను మరియు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను నలుగు దిక్కులకు చాటుతున్న మట్టిలో మాణిక్యం మహమ్మద్ ఉసమా ఖాదర్ ను ప్రభుత్వం ప్రోత్సహించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని క్రీడాభిమానులు కోరుతున్నారు. ఎస్డిపీఎఫ్ స్పోర్ట్ డెవలప్మెంట్ ప్రమోషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోచ్ అద్నాన్ ఆమోది ద్వారా ఖాదర్ శిక్షణ తీసుకుంటున్నారు. తమ కుమారునికి చేయూతనందించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.