Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Traffic Jam : చక్రబంధంలో కుంభమేళా, 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో సరి హద్దులు మూసివేత

Traffic Jam : ప్రజా దీవెన, హైదరాబాద్ : కుంభమేళా చుట్టూ 300 కిలోమీట ర్ల ట్రాఫిక్ జాం కావడంతో రెండు రా ష్ట్రాలు సరిహద్దులు మూసివేశా యి. మన హైదరాబాద్ లో కాదు, బెంగళూరులోనే కాదు, ఢిల్లీలో అంతకన్నా కాదు, ప్రపంచలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం మన ఇం డియాలోనే 300 కిలోమీటర్లు ట్రా ఫిక్, ఎక్కడి వాహనాలు అక్కడే ఎటు వెళ్లాలన్నా దారి లేదు, ప్రతి దారిలోనూ వాహనాలే రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకుని తీరిగ్గా వెళ్దామని అనుకున్నా వాహనాలు పార్క్ చేయటానికి స్థలం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో రోడ్లపై గంటలు గంటలు వాహనా ల్లోనే ప్రజలు నరకం చూస్తున్నారు. ఇదంతా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో కుంభమేళా జరు గుతున్న త్రివేణి సంగమానికి వచ్చే అన్ని రహదారుల్లోనూ ట్రాఫిక్ జా మ్ తో బీభత్సంగా ఉంది. కుంభమే ళాకు వెళ్లే అన్ని రూట్లలో 300 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జాం ఉందని, సాధారణ రోజుల్లో 20 నిమిషాల జర్నీ ఇప్పుడు ఆరు, ఏడు గంటల సమయం పడుతుందని లక్షల మం ది వాహనాల్లోనే చిక్కకున్నారని యూపీ ట్రాఫిక్ డీసీపీ కుల్దీప్ సింగ్ ప్రకటించటం విశేషం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ, మైహార్, జబల్ పూర్ నుంచి కుంభమేళాకు వచ్చే రహదారులను మూసివేసినట్లు ప్రకటించారు యూపీ ట్రాఫిక్ అధికారులు. మౌని అమావాస్య తరహాలోనే రద్దీ విపరీతంగా ఉందని.

 

ఇప్పటికే కుంభమేళాలో పార్కింగ్ కోసం కేటాయించిన అన్ని స్థలాలు నిండిపోయాయని, అం దుకే మధ్యప్రదేశ్, యూపీ సరిహ ద్దులను మూసివేసినట్లు వెల్లడిం చారు. కుంభమేళా నుంచి బయట కు వచ్చే వాహనాలను అంచనా వేసి, అప్పుడు పంపిస్తామని ప్రక టించారు. దీంతో సరిహద్దుల్లో వా హనాల్లో చిక్కుకుపోయిన వారికి ఆహారం, మంచినీళ్లు అందించటా నికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, ఎవరూ భయపడొద్దని, ఆందోళన చెందొద్దని ప్రకటించింది యూపీ ప్రభుత్వం. కుంభమేళా ప్రాంతం చుట్టూ 30 వేల వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాం అని.. ఇప్పుడు అక్కడ కూడా నిండిపోయిందని.. వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే.. రోడ్లపై నిలిపివేయటం తప్ప.. మరో మార్గం లేదంటున్నారు యూపీ అధికారులు.ఓవరాల్ గా అలహా బాద్ కు వచ్చే అన్ని మార్గాల్లో ఏకంగా 300 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది.. ఆరు, ఏడు లక్షల మంది జనం ఆయా రహదారుల్లో కుంభమేళాకు వచ్చేం దుకు వాహనాల్లోనే ఉండిపోయా రు. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బం ది పడుతున్నట్లు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. కుంభ మేళా ముగింపు దశకు కూడా రావ టంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తుండటం తో రద్దీ విపరీతంగా పెరిగిందంటు న్నారు అధికారులు. ఇప్పుడు అ యితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫి క్ జాం.. మన కుంభమేళాలోనే అంటున్నారు నెటిజన్లు.