Traffic SI Mallesh: ప్రజా దీవెన, కోదాడ: ద్విచక్ర వాహనాలకు (Two-wheelers) నెంబర్ ప్లేట్లులు (number plates) లేకపోయినట్లయితే వాహనదారులపై కఠిన చర్యలు (Strict measures)తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ (SI Mallesh) హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.వాహనాలకు నెంబర్ ప్లేట్లలు లేకపోవడం,ఉన్నా కూడా అస్తవ్యస్తంగా ఉండి కనిపించకపోవడం లాంటి వాటిని సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
ఇదే కాకుండా వాహనాలకు సంబంధించి వివిధ రకాల లైసెన్సులు,ఇన్సూరెన్స్,హెల్మెట్ (Licenses, Insurance, Helmet)కలిగి ఉండాలని ఆయన యజమానులకు స్పష్టం చేశారు.ముఖ్యంగా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామనే విషయం తెలిసినప్పటి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని అన్నారు.గతంలో వివిధ రకాలుగా అపరాధ రుసుములు విధించినప్పటికీ కూడా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఇది ఇలా ఉంటే వాహనాల తనిఖీల్లో (Inspection of vehicles) భాగంగా నంబర్ ప్లేట్లు లేని ఐదు వాహనాలను పట్టుకొని సీజ్ చేసామని తెలిపారు.