Breaking news: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం, వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృత్యు వాత
Breaking news : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ బండ్ల గూడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలి స్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. అ డ్డువచ్చే విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో ఆకస్మాత్తు గా షాక్ తగిలి ప్రమాదం జరిగింది. మరో ఘటన అంబర్‌పేట్ జరుగగా లో రామ్ చరణ్ అనే యువకుడు ఇదే విధంగా విగ్రహం తరలిస్తుం డగా అడ్డు వచ్చిన విద్యుత్ తీగల ను తొలగిస్తున్న సమయంలో వి ద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కో ల్పోయాడు. ఆదివారం రాత్రి రా మంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలి సిందే. రెండు రోజుల వ్యవధిలో మూడు విద్యుత్ షాక్ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకో వాలని అధికారులు చెబుతున్నా రు.
హైదరాబాద్ లో వేర్వేరు సంఘటన ల్లో వినాయక విగ్రహాల తరలింపు లో లో ఘోర అపశృతులు చోటుచే సుకున్నాయి. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రమా దం సంభవించింది. పాతబస్తీ ఘట నలో ఇద్దరు యువకులు మృత్యు వాత పడ్డారు.మృతులు టోనీ (2 1), వికాస్ (20) లుగా గుర్తించారు. మరో యువకుడు అఖిల్ కు తీవ్ర గాయాలు కాగా, అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీ సులు అక్కడికి చేరుకుని కేసు న మోదు చేశారు. విద్యుత్ వైర్లు కింద కు వంగి ఉండటమే ఈ ప్రమాదాని కి కారణమని ప్రాథమికంగా భావి స్తున్నారు. ఆకస్మికంగా జరిగిన ఈ విషాదం ఆయా ప్రాంతాల్లో కలకలం రేకెత్తించింది.
వినాయక నిమజ్జన ఉత్సాహం మ ధ్య ఇలాంటి ఘటన జరగడంతో బండ్లగూడలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అధి కారులు భవిష్యత్తులో ఇలాంటి ఘ టనలు జరగకుండా ముందస్తు చ ర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.