Road Accident Suryapet : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో విషాదం, రోడ్డు ప్రమాదoలో అసు వులుబాసిన అన్నదమ్ములు
Road Accident Suryapet : ప్రజా దీవెన, తుంగతుర్తి: దసరా పండుగ సరదాలు దేశ వ్యాప్తంగా పలుచోట్ల విషాదాన్ని నింపాయి. ద సరా పండుగ సందర్భంగా స్వ స్థ లాలకు చేరుకున్న ఆయా కుటుం బాలు దసరా పండుగ సంతోషాల ను మరువక ముందే విషాదంలో మునిగితేలాయి. దుర్గామాత నిమ జ్జనంలో అపశృతి కారణంగా చెరు వులోమునిగి పది మంది మృత్యు వాత పడగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, అదే సందర్భంలో తెలంగాణ రా ష్ట్రంలో నల్లగొండ జిల్లా, సూర్యా పే ట జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో జరిగి న సంఘటనల్లో పదుల సంఖ్యలో మరణించి వారి కుటుంబాల్లో విషా దాన్ని మిగిల్చారు.
తాజాగా శుక్రవారం సూర్యాపేట జి ల్లాలో సంతోషాలతో గడపాల్సిన ద సరా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపిన సంఘటన చోటు చేసుకుం ది. పండుగ రోజు కుటుంబంతో గడి పిన తోడబుట్టిన అన్నదమ్ములు వం డిన వంటకాలను సంతోషంతో అ మ్మమ్మకు ఇచ్చి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెం దిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సంఘటన పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి.
తిరుమలగిరి మండలం మాలిపు రం గ్రామానికి చెందిన వేముల దేవ య్య, మంగమ్మల దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కు మారుడు వేముల నాగరాజు (26) కు గతేడాది డిసెంబర్ లోనే పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధు లు నిర్వహిస్తున్నాడు. ఇక రెండో కు మారుడు కార్తీక్(24) డ్రైవర్ గా ప నిచేస్తున్నాడు.
పండుగ పూట వంటకాలను తుం గతుర్తి మండల కేంద్రంలోని తన అ మ్మమ్మ కత్తులఎల్లమ్మకు ఇచ్చి తిరి గి స్వగ్రామానికి వస్తుండగా బండ రామారం క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదు పుతప్పి పడిపోవడంతో కార్తీక్ అక్క డికక్కడే చనిపోగా నాగరాజుకు బ లమైన గాయాలు కావడంతో చికి త్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి నార్కట్ పల్లి లోని కామినేనికి తర లించగా చికిత్స పొందుతూ నాగరా జు సైతం తుది శ్వాస విడిచారు.
ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈ ఇద్దరు సోదరుల కు ఇంకా వివాహం కాకపోగా పేదరి కంలో మగ్గుతున్న ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ కుటుంబం లో నెలకొన్న సంతోషాలకు తోడు దసరా పండుగ సరదాలు తోడ య్యాయి. అంతలోనే జాబ్ వచ్చిన నాగరాజు ఏడాది తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, తమ్ముడు కార్తీక్ కూడా అన్న తోటే మృత్యువాత పడడం అందరినీ ఆ కుటుంబంతో పాటు గ్రామంలో వి షాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న చుట్టుపక్క ల ప్రాంతాల ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ నిట్టూర్చడం కనబ డింది. పండుగపూట కుటుంబoలో విషాదాన్ని నింపిన సంఘటన దుర దృష్టకరమైందంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం, అదే సందర్భంలో సానుభూతి వ్యక్తం చేయడం కొన సాగింది. ఈ మేరకు తుంగతుర్తి పో లీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.