Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Trains : ప్రయాణికులకు తీపి కబురు,మహా కుంభమేళాకు చర్లపల్లి నుంచి ప్ర త్యేక రైళ్ళు

Trains : ప్రజా దీవెన, హైదరాబాద్: మహా కుంభమేళా వేళే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. హైదరాబాద్ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటిం చింది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 24 తేదీల మధ్య ఈ ట్రై న్స్ రాకపోకలు సాగించనున్నా యి.మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.బీదర్ – ధన పుర్ మధ్య ఫిబ్రవరి 14వ తేదీన స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది ఉద యం 11 గంటలకు బీదర్ నుంచి బయల్దేరి, రెండో రోజు నాడు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ చేరు తుంది. ఈ ట్రైన్ జహీరాబాదాద్, వికారాబాద్, బేగంపేట్, సికింద్రా బాద్, జనగాం, కాజీపేట, జమ్మికుం ట, పెద్దపల్లి, రామగుండం, మంచి ర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ తో పాటు మరికొన్ని స్టేషన్ల మీదుగా వెళ్తోంది.ఇక హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ధన్ పూర్ కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది.

 

ఈ ట్రైన్ (నెంబర్ 07112)ఫిబ్రవరి 16వ తేదీన ధన్ పుర్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇక చర్లపల్లి నుంచి ధన్ పుర్ మధ్య మరో సర్వీస్(07077) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఫిబ్రవరి 18,22 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ రైల్వే స్టేషన్ కు చేరుతుంది.ధనపుర్ నుంచి చర్లపల్లికి ఫిబ్రవరి 20, 24 తేదీల్లో ట్రైన్ అందబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ (07078) ధన్ పుర్ నుంచి మధ్యాహ్నం 03.15 గంటలకు బయల్దేరి… రెండో రోజు రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి స్టేషన్ కు చేరుతుంది.