Minister Jaipal Reddy : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి ఘన నివాళి, ఆయన రాజకీయ జీవితం ఆదర్శమన్న ప్రముఖులు
Minister Jaipal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమపార్లమెంటేరి యన్ దివంగత జైపాల్ రెడ్డికి ఘ నంగా నివాళులర్పించారు. పీవీఎన్ ఆర్ మార్గ్ లోని జైపాల్ రెడ్డి స్మార కం స్తూపం స్ఫూర్తి స్థల్ వద్ద సోమ వారం మంత్రులు, ప్రముఖులు ని వాళులర్పించారు. ఆయన రాజకీ య జీవితం నేటి తరానికి ఆదర్శమ ని ఈ సందర్భంగా నేతలు కొనియా డారు. జైపాల్ రెడ్డి విద్యార్థి నాయ కుడి నుంచి జాతీయస్థాయి నాయ కుడిగా ఎదిగారన్నారు.
ఆయన నిరంతరం డెమోక్రసి గు రించి కొట్లాడారని, ప్రజల సమస్యల పై పార్లమెంట్ లో ఆయన పోరాటం చేసిన తీరుగొప్పదన్నారు. తెలంగా ణ ఉద్యమం సమయంలో ఆయన తమకు సలహాలు అందించారన్నా రు. జైపాల్ రెడ్డి నాయకుడు మాత్ర మే కాదు మంచి విమర్శకుడు కూ డా అన్నారు. కేంద్ర మంత్రిగా మంచి విలువలతో కూడిన నిర్ణయాలు తీ సుకున్నారని పేర్కొన్నారు.
అవినీతిని సహిం చని వ్యక్తి జైపాల్ రెడ్డి అన్నారు. తాము కొత్తగా పార్ల మెంట్లో అడుగు పెట్టినప్పుడు జైపా ల్ రెడ్డి వద్ద పార్లమెంటరీ విధానం గురించి తెలుసుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నూ ఎలా ముందుకు వెళ్లాలనే విష యమై ఆయన ఎంపీలకు సలహా లి చ్చేవారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన పాత్ర కీల కమని పేర్కొన్నారు. హైదరాబాద్ కు మెట్రోతో పాటు ఇతర ప్రాజెక్టుల ను అందించి అభివృద్ధి చేసిన ఘన త ఆయనదే అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డి , ప్రణాళి కా సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్ర భాకర్ గౌడ్, వివేక్ వెంక టస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.