Actor Kota Srinivasa Rao : ప్రజా దీవెన, కోదాడ:ప్రముఖ చలనచిత్ర నటులు, రంగస్థల నటులు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల కోదాడలోని తెర సాంస్కృతిక కళా మండలి సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ …750 చిత్రాలకు పైగా నటించి, వెండి తెర పై తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. తెర సంస్కృతిక కళామండలితో 1994 నుంచి అనుబంధం ఉన్నదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.సంస్థ గౌరవ సలహాదారులు పార సీతయ్య మాట్లాడుతూ… తను భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, తను నటించిన చిత్రాలు శాశ్వతంగా, సజీవంగా నిలిచిపోతాయని ఆయన అన్నారు.
తన నటనకు ఎవరు వెలకట్టలేరని ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే గుణం తనలో ఉన్నదని, అందుకే తొమ్మిది నందులను సొంతం చేసుకొని అనేక స్వచ్ఛంద సంస్థలతో సత్కారాలు పొందారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సంస్థతో కోట శ్రీనివాసరావుకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొని, ఆయనకు సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఓరుగంటి వెంకట బ్రహ్మం, ఎస్.కె మీరా, ఎస్.కె.పీర్ సాహెబ్, జూలూరు వీరభద్రం,జీ.వి రాజు, కోలా శ్రీనివాసరావు, పెద్దినేని రామారావు, పాలూరి సత్యనారాయణ, మాలోత్ సైదా నాయక్, కొవ్వూరి వెంకట్రావు, ఎం. వి .ఎస్. శాస్త్రి, షేక్. యాకూబ్, బూర సైదారావు, వేల్పుల తిరూప్, ఆవుల శ్రీనివాసరావు, గుండెల సూర్యనారాయణ మొదలగు వారు ఉన్నారు.