— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ఈనెల 29 నుండి ఫిబ్రవరి 22 వరకు, అలాగే మార్చి 5 నుండి మార్చి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రాక్టికల్, థియరీ పరీ క్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణపై సోమవారం ఆమె ప్రజావాణి కార్యక్రమం అనం తరం సంబంధిత జిల్లా అధికారు లతో సమీక్ష నిర్వహించారు.ఈ సంవత్సరం నిర్వహించనున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఒకేషన ల్ ప్రాక్టికల్ పరీక్షల సందర్భంగా ప్రతి ల్యాబ్ లో తప్పనిసరిగా 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ కళా శాలలో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు ల్యాబులలో ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుందని, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు ల్యాబులలో తప్పనిసరిగా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని ఒక వేళ లేనట్లయితే ఆ కళాశాలలకు ప్రాక్టికల్ ,థియరీ పరీక్షల కేంద్రాలను రద్దు చేయడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.
ఈనెల 29న ఎథికల్, హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ ,30న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్, ఈనెల 31 మరియు ఫిబ్రవరి 1న ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉంటాయని తెలిపారు .ఫిబ్రవరి 3 నుండి 22 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ప్రతిరోజు రెగ్యులర్ ,ఒకేషనల్ విద్యార్థులకు రెండు పూటల ఉదయం 9 నుండి 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
అలాగే మార్చి 5 నుండి 25 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు, బందోబస్తు, జిరాక్స్ కేంద్రాల మూసివేత ,144 వ సెక్షన్ విధింపు, తదితర విషయాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రునాయక్, జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వరరా వు ,గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, డిఎస్ఓ వెంకటే శ్వర్లు, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.