Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi : ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉన్న నేపథ్యం లో ఈనెల 3 న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికల పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగ దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

 

జిల్లాలోని ప్రజలందరూ ఈ విష యాన్ని గమనించి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్య క్రమానికి ఫిర్యాదులు సమర్పించే నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వ హించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.