Tripathi : ప్రజాదీవెన, నల్గొండ : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల విద్యార్థినులను విద్య,క్రీడలు,అన్ని అంశాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీల ప్రత్యేక అధికారులకు సూచించారు.సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులతో కేజీబీవీ లోని విద్యార్థుల ఆహారం, విద్య,నిర్వహణ, తదితర అన్ని అంశాలలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కేజీబీలలో చదివే విద్యార్తినిలను అన్ని అంశాలలో తీర్చిదిద్ది వారిని మంచి సామర్థ్యం ఉన్నవారిగా తయారు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి జేఈఈ మెయిన్స్, ఎన్ఐటి, నీట్ తదితర ఎంట్రన్స్ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయాలని అన్నారు.
పాఠశాలలో ప్రతిభ కలిగిన ఎంపికైన విద్యార్థులకు మంచి కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి 5 విద్యార్థినులకు సైన్స్ ఎక్స్పోలకు తీసుకు వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కేజీబీవీ ల అంతర క్రీడా పోటీలు తోపాటు, జోనల్ స్తాయిలో నిర్వహించే క్రీడలలో విద్యార్థినిలు మంచి ప్రతిభ కనపరిచి క్రీడలలో రాణించే విధంగా వారిని తయారు చేయాలన్నారు .జె ఈ ఈ,ఎన్ ఐ టి, నీట్ తదితర పరీక్షలకు ఎన్ సి ఆర్ టి పుస్తకాలు ఇవ్వటం జరుగుతుందని, ఇందుకు పాఠశాల వారీగా జాబితా రూపొందించాలన్నారు.అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, జి సి డి ఓ సరిత, కేజీబీవీల ప్రత్యేక అధికారులు తదితరులు ఉన్నారు.