–యూరియాకు కృత్రిమ కొరత సృ ష్టించవద్దు
— నల్లగొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదు
— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల దుకా ణాల యజమానులు యూరి యాకు కృత్రిమ కోరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండ ల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాల ను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఎవరైనా ఫర్టిలైజర్ దుకా ణదారు లు యూరియాను బ్లాక్ లో విక్ర యించినట్లయితే ఆ షాపుల లైసె న్సు లను రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు .రైతులు సాగు చేస్తున్న భూముల వివరాల ఆధా రంగా ఏ పంటకు ఎంత యూరి యా అవసరమో అంతమే రకు సరఫరా చేయాలని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో వ్యవసాయ అధికా రులు ఎప్పటికప్పుడు గట్టి నిఘా ఉంచాలని, ఫర్టిలైజర్ దుకాణాలను తరచు తనిఖీ చేయాలని ఆమె ఆదేశించారు.
ఫర్టిలైజర్ దుకాణాదారులు వారి వద్ద ఉన్న యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడై నా యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరిం చారు .ఎక్కడైనా యూరియాకు సమస్యలు ఉన్నట్లు తెలిస్తే జిల్లా వ్యవసాయ అధికారి లేదా ఆయా మండలాల వ్యవసా య అధికారుల దృష్టికి తీసుకు రావాలని ఆమె రైతులకు సూచిం చారు. నల్గొండ జిల్లాలో యూరి యాకు ఎలాంటి కొరతలే దని, అవసరమైనమేర యూరి యా నిల్వలు అందుబా టులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్ట ర్ కనగల్ ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా నిల్వలను, సరఫరా వివరాలను కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలించారు.