Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యమని, చదువుతోనే ఆడపిల్లలు అసాధ్యు లవుతారని జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం నాడు జాతీయ బాలికా దినోత్సవం సంద ర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో నల్లగొండ పట్ట ణం లోని క్లాక్ టవర్ వద్ద నుండి విద్యార్దినుల మరియు మహిళలు తో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఉాపి ప్రారంభిం చారు. ఈ సందర్బంగా బేటి బచా వో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఆడ పిల్లలను చదివించా లని, వారు చదువుకుంటే ఏదైనా సాధ్యమని అన్నారు.ప్రధానమంత్రి, ఉపాధ్యాయులు కావాలన్నా లక్ష్యా లను తేలికగా సాధించగలరని అన్నారు. ఆడపిల్లలు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకో వాలని అన్నారు. చదువు వలన కలిగే లాభాలను, ఎందుకోసం చదువుకోవాలి అనే విషయాల పట్ల కలెక్టరు విద్యార్ధులను అడిగి వారిలో ఆసక్తి కలిగించారు.
2015 నుండి ప్రారంభమైన జాతీయ బాలి కా దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున పాఠశా లలు, కళాశాలలు, వసతి గృహా లు, అంగన్వాడీ కేంద్రాలలో మహి ళలకు, విద్యార్థినులకు వచ్చే మా ర్చి 8 వ తేదీ వరకు భ్రూణ హత్య లను నివారించడం, బాలికా విద్య ను పోత్సహించడం, మహిళా సాధి కారత దిశగా అవగాహన కార్య క్రమాలు నిర్వహించడం జరు గుతుందని, లింగ వివక్షత లేకుండా మహిళా సాధికారతను పోత్స హించడం దీని లక్ష్యాలని తెలి పారు. తల్లిదండ్రులు కూడా తమ పిలలను చదివించడంలో అశ్రద్ద వహించకుండా వారికి ఏ రంగంలో ఇష్టముంటే వాటిలో ప్రోత్సహించాలని సూచించారు.
జిల్లా న్యాయ సేవా అధారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి ఈ సందర్భంగా మాట్లా డుతూ తల్లిదండ్రుల పెంపకంలో అమ్మాయిల పట్ల ఎలాంటి వివక్షత చూపకుండా అన్ని రంగాలలో సమానంగా పోత్సహించాలని అన్నారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, తల్లిదండులు తమ ఆస్తిలో పిల్లల పట్ల ఎలాంటి వివక్ష చూపవద్దని అన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, చదువు ద్వరానే సాదధికారత సాధ్యమని అన్నారు. ఆడపిల్లలు అని రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి కృష్ణవేణి, జువైనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ మోహన్ రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ వెంకన్న, గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి సరిత, సిడిపివోలు సూపర్వైజర్లు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.