Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి అవసరమై న పల్స్ ఆక్స్ లో మీటర్లు, సెల్ కౌంటర్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపా రు. బుధవారం ఆమె నల్గొండ జి ల్లా, హాలియా ప్రాథమిక వైద్య ఆరో గ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.సిబ్బంది అటెండెన్స్ రిజిస్ట ర్ ను పరిశీలించి ప్రాథమిక వై ద్య ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వై ద్యులు, సిబ్బంది, హాజరైన వారు, గైర్హాజరైన వారు తదితర వివరాల ను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బం ది అందరూ సకాలంలో పిహెచ్ సి కి రావాలని, ఒకవేళ ఏదైనా అత్య వసరపనిపై పీహెచ్ సి కి రాలేక పోతే ముందస్తు అనుమతి తీసు కోవాలని ఆమె సూచించారు. ఎ లాంటి అనుమతి లేకుండా విధు లకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చ రించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలతో పాటు, సాధారణ ప్రసవాలను పెంచాలని ఆమె సూ చించారు.అనంతరం జిల్లా కలెక్టర్ హాలియా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి బాలిక విద్యాలయలో సౌక ర్యాలను, కిచెన్ వంట సామాగ్రి సరుకులు, విద్యార్థుల చదువు, తదితర విషయాలను పరిశీ లించారు.
అంతేకాక విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసు కున్నారు.కాగా కేజీబీవీ లో డైనింగ్ హాలు లేదని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థినిలకు ఇబ్బందులు కలగకుండా వారం రోజుల్లో డైనింగ్ హాల్ షెడ్ ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ను ఆదేశించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ప్రాథ మిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.